
ఉగాది పురస్కారాన్ని అందుకుంటున్న దిబ్బమడుగు మద్దయ్య
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయంలో విశేషమైన ప్రతిభ కనబరిచిన అతి సాధారణ రైతు దిబ్బమడుగు మద్దయ్య బుధవారం ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ విష్ణువర్డన్‌రెడ్డి, పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రం మొత్తం మీద ఆరుగురు రైతులకు ఉగాది పురస్కారాలు లభించాయి. వీరిలో ఓర్వకల్లు మండలం చెన్నంచెట్టిపల్లి గ్రామానికి చెందిన మద్దయ్య ఒకరు. నూనె గింజలకు చెందిన ఆముదం సాగులో నూతన వంగడాల వినియోగం, వినూత్న పద్ధతులు పాటించి తక్కువ ఖర్చుతో గణనీయమైన దిగుబడలు సాధించారు. ఉగాది పురస్కారాన్ని అందుకున్న మద్దయ్యను ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ రామారావు, విస్తరణ సంచాలకలు విజయాభినందన, పరిశోధన సంచాలకులు ప్రశాంతి అభినందించారు. గుంటూరులో జరిగిన ఈ కార్యక్రమంలో కర్నూలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ప్రసాద్‌బాబు కూడా పాల్గొన్నారు.