కానిస్టేబుళ్లుగా ఎంపికై న అక్కాచెల్లెళ్లకు సత్కారం
ఇబ్రహీంపట్నం: తొలి ప్రయత్నంలో కానిస్టేబుళ్లుగా ఎంపికై న అక్కాచెల్లెళ్లు రత్నశ్రీ, జయశ్రీని పలువురు బుధవారం అభినందించారు. జి.కొండూరు మండలం భీమవరప్పాడు గ్రామానికి చెందిన వంగూరి చిట్టిబాబు పోలీస్ శాఖలో హోం గార్డుగా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు తేజ బసవశ్రీ, రత్నశ్రీ, జయశ్రీ ఉన్నారు. పెద్ద కుమార్తె తేజ బసవశ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిశారు. రెండో కుమార్తె రత్నశ్రీ, మూడో కుమార్తె జయశ్రీ సివిల్ పోలీళ్లుగా ఎంపికయ్యారు. ఇబ్రహీంపట్నం ఎంపీడీఓ కార్యా లయం వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో రత్నశ్రీ, జయశ్రీని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్ తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


