గుడివాడలో మ్యూటేషన్‌ మాయ | - | Sakshi
Sakshi News home page

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ

Dec 10 2025 7:29 AM | Updated on Dec 10 2025 7:29 AM

గుడివ

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ

బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025 గుడివాడలో మ్యూటేషన్‌ మాయ పులిచింతల సమాచారం దుర్గమ్మ సేవలో హోం మంత్రి 17 నుంచి ట్రెడిషనల్‌ మెడిసిన్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ రైతులంటే చంద్రబాబుకు చులకన

న్యూస్‌రీల్‌

తమ పార్టీ నాయకుడి ఆస్తి కొట్టేసేందుకు టీడీపీ నాయకుడి యత్నం ఇంటి పన్ను పేరు మార్చి రూ.1.50 కోట్ల ఆస్తికి అక్రమ రిజిస్ట్రేషన్‌ అధికార పార్టీ నాయకులకు మునిసిపల్‌ అధికారుల అండదండలు

కృష్ణాజిల్లా
బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 109 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 4400 క్యూసెక్కులు వదులుతున్నారు. నిల్వ 43.3532 టీఎంసీలు.

ఇంద్రకీలాద్రి: భవానీ దీక్షల విరమణ ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా మంగళవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వచ్చిన హోం మంత్రి వంగలపూడి అనిత దుర్గమ్మను దర్శించుకున్నారు.

పాయకాపురం (విజయవాడ రూరల్‌): ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి 19వ తేదీ వరకు న్యూఢిల్లీ లోని భారత్‌ మండపంలో రెండో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ట్రెడిషనల్‌ మెడిసిన్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ జరుగుతుందని ఆయుర్వేద పరిశోధన అధికారి డాక్టర్‌ కె.మిథున్‌ మోహన్‌ తెలిపారు. విజయవాడ పాయకాపురంలోని న్యూ రాజీవ్‌నగర్‌లో ఉన్న ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆవరణలో మంగళవారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్‌ కె. మిథున్‌ మోహన్‌ మాట్లాడుతూ.. ఆయుష్‌ వ్యవస్థల ప్రత్యేక ప్రదర్శన, దేశ జ్ఞాన వారసత్వం, ప్రజారోగ్య సమన్వయం, పరిశో ధన – సాంకేతికత, అనుభవాత్మక వెల్‌నెస్‌ వంటి రంగాలను ప్రతిబింబించే ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సుమారు వంద దేశాల నుంచి ఐదు వేల మంది ప్రతినిధులు వర్చువల్‌గా పాల్గొంటారని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో 700 మంది ప్రత్యక్షంగా హాజరు కానున్నారని, వందకు పైగా దేశాల నుంచి 79 అధికారిక ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు. సమ్మిట్‌ ముగింపు రోజున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అఽధానోంగేబ్రియేసస్‌, పలు దేశాల ఆరోగ్య మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటా రని వెల్లడించారు. ఈ సమావేశంలో పరిశోధన అధికారులు డాక్టర్‌ సుజాత, పి.ధోకే తదితరులు పాల్గొన్నారు.

గుడివాడ రూరల్‌: గుడివాడ మునిసిపాలిటీలో మ్యూటేషన్‌ పేరుతో కొందరు అవినీతి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. లంచాలు ఇస్తే చాలు ఎవరి ఇంటి పన్ను పేరునైనా మార్చేస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల ఆస్తులకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. ముని సిపాలిటీ పరిధిలో ఎవరైనా ఆస్తులు కొనుగోలు చేస్తే తప్పకుండా వారి పేరు మీద ఆస్తి పన్నును మార్చుకోవాల్సి ఉంటుంది. ఆస్తి పేరు మార్పును మ్యూటేషన్‌ అంటారు. మ్యూటేషన్‌ చేయాలంటే ప్రస్తుత ఆస్తి విలువలో ఒక శాతం మొత్తాన్ని దరఖాస్తు దారుడు కచ్చితంగా మునిసిపాలిటీకి రుసుముగా చెల్లించాలి. దీనికి సంబంధించి వార్డు సచివాలయ అడ్మిన్‌, మునిసిపల్‌, రెవెన్యూ అధికారులు ఆమోదించి మునిసిపల్‌ కమిషనర్‌కు పంపాలి. చివరగా మునిసిపల్‌ కమిషనర్‌ లాగిన్‌ ద్వారా డిజిటల్‌ సంతకంతో మ్యూటేషన్‌ ప్రక్రియ జరుగుతుంది.

పన్ను పేరు మార్పు రశీదుతో అక్రమ రిజిస్ట్రేషన్‌

గుడివాడ మునిసిపాలిటీ నుంచి ఆన్‌లైన్‌లో జారీచేసిన రెండు ఆస్తి పన్ను రశీదుల ద్వారా రూ.1.50 కోట్ల ఆస్తిని అధికార టీడీపీకి చెందిన మైనారిటీ నాయకుడు అక్రమంగా కొట్టేశాడు. కొసమెరుపు ఏమిటంటే ఆ ఆస్తి ఆ పార్టీకే చెందిన మరో మైనారిటీ నాయకుడిది. సదరు మైనార్టీ నాయకుడు వేరే వారి ఆస్తిని తన భార్య పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించేశాడు. ఆస్తి పన్ను రశీదును ప్రామాణికంగా, కేవలం నోటి మాట ద్వారా తన ఆస్తి అని చెప్పి పార్టీ అండదండలతో ఈ తతంగం జరిపించాడు. ఈ క్రమంలో అసలు ఆస్తి వారసులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి ఆరా తీయగా అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారం బయట పడింది. తమ కార్యాలయ పరిధిలో అక్రమ రిజిస్ట్రేషన్‌ జరిగిందంటూ గుడివాడ సబ్‌ రిజిస్ట్రార్‌ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు. ఆస్తి పన్ను రశీదుతోనే అక్రమ రిజిస్ట్రేషన్‌ జరిగిందని మునిసిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే పొరపాటును గుర్తించి పాత యజమాని పేరునే ఇంటి పన్ను యథావిధిగా కొనసాగేలా అక్టోబర్‌లో ఉత్త ర్వులు ఇచ్చి సరిపెట్టారు. అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వ్యక్తిపైన, అందుకు సహకరించిన అధికారులపైన, ఇంటిపన్ను పేరు మార్చిన అధికారులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సాధారణంగా ఇటువంటి అక్రమాలు వెలుగుచూసినప్పుడు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు అంతర్గత విచారణ జరుగుతుంది. అయితే ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంపై మునిసిపల్‌ కార్యాలయంలో అంతర్గత విచారణే జరగలేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

గుడివాడ మునిసిపాలిటీ నుంచి

జారీ చేసిన ఇంటి పన్ను రశీదు

పేరు మారిన తర్వాత పొందిన రశీదు

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఉమ్మడి కృష్ణాజిల్లా స్థాయి బాడీబిల్డింగ్‌ పోటీలను ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్‌ జిల్లా బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ కార్యదర్శి వినోద్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పపర్‌ ఫిట్నెస్‌ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని, 50 నుంచి 80 కిలోలు, మెన్స్‌ ఫిజిక్‌ కేటగిరిల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విజేతలకు నగదు బహుమతితో పాటుగా సర్టిఫికెట్‌ను అందజేస్తామని తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ న్యూ రాజరాజేశ్వరీపేట, రైల్వే గేట్‌ దగ్గర ఉన్న ఆర్‌సీఎం చర్చి గ్రౌండ్‌లో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు 28వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్‌సీఎం చర్చి గ్రౌండ్‌ దగ్గర హాజరు కావాలని కోరారు. ఇతర వివరాలకు ఎన్టీఆర్‌ జిల్లా బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ సంయుక్త కార్యదర్శి వెంకటేష్‌–79972 29559, 99850 08615 నంబ ర్లలో సంప్రదించాల్సిందిగా కోరారు.

28న బాడీ బిల్డింగ్‌ పోటీలు

భవానీ దీక్షల విరమణకు వేళాయె

7

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ1
1/10

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ2
2/10

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ3
3/10

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ4
4/10

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ5
5/10

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ6
6/10

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ7
7/10

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ8
8/10

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ9
9/10

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ10
10/10

గుడివాడలో మ్యూటేషన్‌ మాయ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement