మహిళకు స్క్రబ్‌ టైఫస్‌ | - | Sakshi
Sakshi News home page

మహిళకు స్క్రబ్‌ టైఫస్‌

Dec 10 2025 7:26 AM | Updated on Dec 10 2025 7:26 AM

మహిళక

మహిళకు స్క్రబ్‌ టైఫస్‌

మహిళకు స్క్రబ్‌ టైఫస్‌ కృత్తివెన్ను: కృతివెన్ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అడ్డపర్ర గ్రామం చినగట్టు పుంతలో ఒక మహిళకు స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి నిర్ధారణ అయినట్లు పీహెచ్‌సీ వైద్యుడు సాయిసందీప్‌ తెలిపారు. ఆమె తీవ్రమైన జ్వరం, తలనొప్పితో ఈనెల ఒకటో తేదీ నుంచి బాధపడుతోందని, బంటుమిల్లిలో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స తీసుకుంటుందన్నారు. వ్యాధి తగ్గకపోవడంతో ఈనెల 6వ తేదీన బందరు పెద్దాస్పత్రిలో అడ్మిట్‌ అవ్వగా ఆమెకి స్క్రబ్‌ టైఫస్‌గా నిర్ధారణ అయిందని వైద్యుడు సాయి సందీప్‌ వివరించారు. ఆమె పరిిస్థితి సీరియస్‌గానే ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యాధికి గల కీటకం పరిసరాల అపరిశుభ్రత, చెత్తాచెదారం, శుభ్రత లేని వాతావరణం కలిగి ఉంటే వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ప్రజలంతా తమ పరిసరాలను, ఇంటి లోపల సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మంగళవారం ఆయన సిబ్బందితో కలిసి వ్యాధి సోకిన బాధితురాలు ఇంటిని పరిసరాలను పరిశీలించి బ్లీచింగ్‌, వ్యాధి నిరోధక రసాయనాలను పిచికారీ చేయించారు. లారీల సమ్మె తాత్కాలిక వాయిదా పోక్సో కేసులో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలి పెడన: ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు జక్కంపూడి కృష్ణకిరణ్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన మండలాలోల విస్తృతంగా పర్యటించారు. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురంలో అంగన్‌వాడీ కేంద్రం, రేషన్‌షాపులను పరిశీలించారు. అనంతరం సంగమూడి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆహార పదార్థాల నాణ్యతలను పరిశీలించడంతో పాటు ఆహారాన్ని రుచి చూశారు. సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బంటుమిల్లి మండలం పెందుర్రు జెడ్పీహెచ్‌ఎస్‌, పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాలలను సందర్శించి ఆహార పదార్థాలను, కూరగాయలు, పప్పుదినుసుల నాణ్యత ప్రమా ణాలు ఎలా ఉన్నాయని స్వయంగా పరిశీలించి తెలుసుకున్నారు. ఈయనతో పాటు మచిలీపట్నం ఇన్‌చార్జి డీవైఈవో శేఖర్‌సింగ్‌, పీడీఎస్‌ డీటీ కె. నాగమల్లేశ్వరరావు తదితరులున్నారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): లారీల ఫిట్‌నెస్‌ చార్జీల పెంపును నిరసిస్తూ మంగళవారం అర్ధరాత్రి నుంచి చేయ తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు న్యూ ఆంధ్రా మోటార్‌ ట్రక్కర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. శేషగిరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం లారీ యజమానులతో చర్చలు జరిగి, పెరిగిన రేట్లు హోల్డ్‌ చేస్తామని, నాలుగు రోజులు సమయం పడుతుందని కోరిన మీదట సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. నాలుగు రోజుల తర్వాత సమస్యను పరిష్కరించకుంటే మళ్లీ యజమానులందరూ సమావేశమై భవిష్యత్‌ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

విజయవాడలీగల్‌: బాలికపై లైంగికదాడి చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి వేల్పుల భవానీ మంగళవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. మాచవరం పోలీసుస్టేషన్‌ పరిధిలో విజయనగర్‌ కాలనీలో తల్లి, ఇద్దరు తమ్ముళ్లతో నివసించే ఫిర్యాది(16) కొంతకాలం హాస్టల్‌లో చదివి, కరోనా వచ్చినప్పటి నుంచి ఇంటివద్దనే నివసిస్తోంది. ఈ క్రమంలో మారుతీనగర్‌లో నివసించే మెడేపల్లి సాయి కుమార్‌ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. వారిరువురు అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో 2021 జూలై 23వ తేదీన ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సాయికుమార్‌ వచ్చి బయటకు వెళ్దామని చెప్పి గుణదల సమీపంలో హోటల్‌ నందు రూమ్‌కి తీసుకెళ్లి నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికదాడి చేశాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఇంటికి వచ్చి తల్లికి చెప్పగా, ఇద్దరూ కలిసి మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేసిన అనంతరం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 2021 జూలై 26వ తేదీన మెడేపల్లి సాయి కుమార్‌ను కోర్టులో హాజరుపరిచారు. విచారణలో సాయి కుమార్‌పై నేరం రుజువైనందున మంగళవారం విజయవాడ పోక్సో న్యాయమూర్తి వేల్పుల భవానీ నిందితుడికి పై విధంగా శిక్ష విధించారు.

రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యుడు కృష్ణకిరణ్‌

మహిళకు స్క్రబ్‌ టైఫస్‌ 1
1/1

మహిళకు స్క్రబ్‌ టైఫస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement