బీపీఎస్‌ ద్వారా అవకాశం కల్పించిన ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

బీపీఎస్‌ ద్వారా అవకాశం కల్పించిన ప్రభుత్వం

Nov 28 2025 7:26 AM | Updated on Nov 28 2025 7:26 AM

బీపీఎస్‌ ద్వారా అవకాశం కల్పించిన ప్రభుత్వం

బీపీఎస్‌ ద్వారా అవకాశం కల్పించిన ప్రభుత్వం

బీపీఎస్‌ ద్వారా అవకాశం కల్పించిన ప్రభుత్వం వాటిపై కొరడా.. 679 భవనాలు గుర్తింపు.. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద..

విజయవాడలో పెద్ద ఎత్తున

అనధికారిక భవనాలు

ఇప్పటి వరకు 679 గుర్తింపు

ఇప్పటికే బీపీఎస్‌ కోసం

113 దరఖాస్తులు

ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీం కింద

మరో 2,279 దరఖాస్తులు

క్రమబద్ధీకరించుకోకపోతే ఇబ్బందులు

తప్పవంటున్న అధికారులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ: బెజవాడ నగరంలో అనధికారిక కట్టడాలు పెద్ద సంఖ్యలో వెలిశాయి. అధికార పార్టీ నాయకుల అండ దండలతో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా కట్టారు. వాటిని క్రమబద్ధీకరించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా అనధికారిక భవనాలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం బీపీఎస్‌ (బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీమ్‌–2025) పథకాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం అనుమతులు లేని భవనాలు, అదనపు అంతస్తులు, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన భవనాలను క్రమబద్ధీకరించుకొనే అవకాశం కల్పించింది. ఈ పథకం 1985 జనవరి1 నుంచి 2025ఆగస్టు 31వ తేదీ, మధ్యన జరిగిన నిర్మాణాలకు వర్తించనుంది. బీపీఎస్‌ పథకం వస్తుందనే సమాచారంతో నగరంలో పెద్ద ఎత్తున అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండ దండలతో అనధికార కట్టడాలకు తెరలేపారు.

ఈ క్రమంలో 2025 ఆగస్టు31 తర్వాత అనుమతులు తీసుకోకుండా కట్టిన భవనాలపైన ప్రస్తుతం నగరపాలక సంస్థ అధికారులు కన్నెర్ర చేస్తున్నారు. అలాంటి భవనాలను గుర్తించి, తొలగిస్తున్నారు. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు వారి పరిధిలోని అనధికార నిర్మాణాలను గుర్తించి ప్రతి రోజు వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో పాటు బీపీఎస్‌ స్కీంకు సంబంధించి భవన యజమానులకు అవగాహన కల్పిస్తూ, క్రమబద్ధీకరణ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

విజయవాడలో ప్రస్తుతం బీపీఎస్‌ స్కీం పరిధిలోకి 679 భవనాలు వస్తాయని నగరపాలక సంస్థ ప్రణాళిక విభాగం అధికారులు గుర్తించారు. దీని సంబంధించి ఇప్పటికే ఆన్‌లైన్‌లో 113 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగరంలోని మూడు సర్కిళ్లలో దాదాపు 1500 అనధికారిక భవనాలు ఉండే అవకాశం ఉందని ప్లానింగ్‌ అధికారులు భావిస్తున్నారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ (లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దీనికి సంబంధించి మొదటి విడతలో 1,076 దరఖాస్తులు వచ్చాయి. మరోసారి ప్రభుత్వం గడువు పెంచి 2026 జనవరి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొనే గడువు పెంచింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మొదటి విడత దరఖాస్తుతో కలిపి 2,279 దరఖాస్తులు వచ్చాయి.

నందమూరి నగర్‌ ఆంధ్రప్రభ కాలనీలో నిర్మిస్తున్న అక్రమ అంతస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement