నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన ఎం. నారాయణ స్వామి కుటుంబం రూ.1,01,116, హైదరాబాద్ చందానగర్‌కు చెందిన సత్విక్, సంహిత రూ.1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
పెనమలూరు: కాలానుగుణంగా స్మార్ట్ నగరాల నిర్మాణం చాలా అవసరమని ఏపీ సీఆర్‌డీఏ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్.గోపాలకృష్ణారెడ్డి అన్నారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో గురువారం సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 3వ అంతర్జాతీయ స్మార్ట్ సస్టైనబుల్ సిటీస్ సదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించారు. భవిష్యత్తు విజన్ దృష్టిలో పెట్టుకుని స్మార్ నగరాల నిర్మాణం చేయాలన్నారు. సివిల్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఉపకులపతి డాక్టర్ పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 54 టెక్నికల్ పేపర్లు ఎంపిక చేశామని తెలిపారు. సీఆర్డీఏ చీఫ్ ఇంజినీర్ సీహెచ్ ధనుంజయ, సీవిల్ హెచ్‌ఓడీ డాక్టర్ వి.మల్లికార్జున, సిద్ధార్థ అకాడమీ ఉపాధ్యక్షుడు ఎస్.విష్ణు, పలువురు పాల్గొన్నారు.
కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించడానికి అవసరమైన 100 బారికేడ్లలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ట్రాఫిక్ విభాగానికి అందజేసింది. గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ షిరీన్ బేగంకు సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నీలకంఠరెడ్డి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మంజుల బారికేడ్లను వితరణ చేశారు. ఈ సందర్భంగా షిరీన్ బేగం మాట్లాడుతూ బారికేడ్ల వల్ల ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజలకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాల గురించి, ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కలిగించే విధంగా తయారు చేశారన్నారు. ట్రాఫీక్ ఏసీపీ రామచంద్రరావు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
నందిగామ రూరల్: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పేర్కొన్నారు. మండలంలోని అంబారుపేట, ఐతవరం, కేతవీరునిపాడు గ్రామాలలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యాన్ని గురువారం ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల వద్ద ప్రభుత్వ మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా, సాఫీగా జరిగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద తూకం, నాణ్యత పరీక్ష, తేమ శాతం రవాణా ఏర్పాట్లు, తదితర అంశాలను రైతులకు వివరించారు. అనంతరం మునగచర్ల గ్రామంలోని రైసు మిల్లును తనిఖీ చేసి స్టాకు వివరాలు, రికార్డులను పరిశీలించారు. ఆర్డీవో బాలకృష్ణ, తహసీల్దార్ సురేష్‌బాబు, వ్యవసా య శాఖ ఏవో నాగేశ్వరరావు పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు
నిత్యాన్నదానానికి పలువురు విరాళాలు


