కేంద్ర మంత్రికి స్వాగతం
విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు గురువారం గన్నవరం విమానాశ్రయంలో అధికారులు స్వాగతం పలికారు. అమరావతిలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ నుంచి విచ్చేశారు. విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి డి. రోనాల్డ్ రోస్, గుడివాడ ఆర్డీఓ జి. బాలసుబ్రహ్మణ్యం, జిల్లా ఆడిట్ అధికారి సూర్యభాస్కరరావు స్వాగతం పలికారు.
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో వంద శాతం ఫలితాలు సాధించే దిశగా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు పేర్కొన్నారు. గురువారం సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో జరిగిన ఎన్టీఆర్ జిల్లాలోని సబ్జెక్ట్ టీచర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు బ్లూ ప్రింట్, మోడల్ పేపర్స్‌పై పూర్తి అవగాహన కలిగి, డీ గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులు కూడా తప్పనిసరిగా పాస్ అయ్యేలా చూడాలని సూచించారు. ప్రతిభావంతులైన విద్యార్థులు 550 నుంచి 600 మార్కులు సాధించేలా ఉపాధ్యాయు లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. డిసెంబర్ నుంచి అమలు కాబోయే వంద రోజుల యాక్షన్ ప్లాన్‌ను పక్కాగా అమలు చేయాలన్నారు.
కేంద్ర మంత్రికి స్వాగతం


