దివిసీమకు భద్రత, భరోసా.. ‘ఆ ఇద్దరే’
వైఎస్సార్ హయాంలో జరిగిన మరికొన్ని అభివృద్ధి పనులు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో..
అవనిగడ్డ: నవంబర్ 19వ తేదీ వస్తుందంటే చాలు 1977లో సంభవించిన ఉప్పెన ఘోరకలిని తలచుకుని దివిసీమ వాసులు ఉలికిపాటుకు గురవుతారు. ఈ ఉప్పెనలో 10 వేల మందికిపైగా ప్రజలు మృత్యువాత పడగా, 2.50 లక్షల పశువులు, 4 లక్షల కోళ్లు చనిపోయాయి. 8,504 ఇళ్లు దెబ్బతినగా ఆ రోజుల్లోనే రూ.172 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలోని 83 గ్రామాలను సముద్రపు అలలు తనలో కలిపేసుకున్నాయి. ఉప్పెన అనంతరం మన రాష్ట్రాన్ని చాలా మంది ముఖ్యమంత్రులు పాలించారు. తమదైన ముద్రతో దివిసీమకు భద్రత, భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రులుగా వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలిచిపోయారని చెప్పవచ్చు.
2 వేల పక్కా గృహాలు.. 22 బహుళ ప్రయోజన భవనాల నిర్మాణం..
2004లో సంభవించిన సునామీ అనంతరం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, మోపిదేవి మండలాల్లోని తీర ప్రాంతాల్లో రూ.19.50 కోట్లతో 2 వేల పక్కా భవనాల నిర్మాణం జరిగింది. పలు స్వచ్ఛంద సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ నాలుగు మండలాల్లో 22 బహుళ ప్రయోజన భవనాలను నిర్మించారు. 1977 ఉప్పెన తరువాత కోడూరు, నాగాయలంక తీర ప్రాంతాల్లో సముద్రపు కరకట్టను పునర్మించారు. అనంతరం ఈ కరకట్టను పట్టించుకున్న వారే లేరు. వైఎస్సార్ హయాంలో 2006లో రూ.22 కోట్లు, 2008లో రూ.18 కోట్లు కలపి మొత్తం రూ.40 కోట్ల వ్యయంతో నాగాయలంక మండలం గుల్లలమోద నుంచి కోడూరు మండలం సాలెంపాలెం వరకు రూ.22 కిలో మీటర్ల మేర సముద్రపు కరకట్టను ఆధునీకరించారు.
వారధి నిర్మాణానికి రూ.109 కోట్లు మంజూరు
రవాణా సౌకర్యం లేక పడవల ద్వారా ఎనిమిది గ్రామాల ప్రజలు నేటికీ రాకపోకల సాగించే రాష్ట్రంలోని ఏకై క ప్రాంతం ఎదురుమొండి దీవులు. ఎదురుమొండి వారధి కోసం గతంలో ఎన్నో డిమాండ్లు, ఆందోళనలు చేసినా పట్టించుకున్న పాలకులు లేరు. ఎదురుమొండి వారధి అనేది దీవుల వాసుల కల. గతంలో గొల్లమంద, ఎదురుమొండి, ఏటిమొగ వద్ద జరిగిన పలు ప్రమాదాల్లో 31 మంది మృత్యువాత పడ్డారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ద్వారా ఈ పరిస్థితులను తెలుసుకున్న నాటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎదురుమొండి వారధి కోసం రూ.109 కోట్లు నాబార్డు నిధులు మంజూరు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా దీనిని పట్టించుకోలేదు.
విద్య, వైద్యానికి పెద్ద పీట..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో రాష్ట్రంలో తొలి మత్స్యకార ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలను నాగాయలంక మండలం భావదేవరపల్లిలో ఏర్పాటు చేశారు. రూ.2 కోట్లతో ఆధునిక భవనాలు నిర్మించగా, ఈ కళాశాలలో వందలాది మంది విద్యార్థులు శిక్షణ పొంది మత్స్య నిపుణులుగా తయారయ్యారు.
వైఎస్సార్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే అభివృద్ధి
వైఎస్సార్ హయాంలో రూ.40 కోట్లతో సముద్ర కరకట్ట ఆధునికీకరణ
రూ.156 కోట్ల ఆధునికీకరణ నిధులతో రైతులకు భరోసా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఎదురుమొండి వారధికి
రూ.109 కోట్ల మంజూరు
అవనిగడ్డలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
రూ.35 కోట్లతో అవనిగడ్డలో 132 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం
రూ.29 కోట్లతో నాలుగు విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్ లైన్ల ఆధునికీకరణ
రూ.1.45 కోట్లతో మందపాకల కాలువ తవ్వకం పనులు
రూ.138 కోట్లతో పులిగడ్డ–విజయవాడ డబుల్ లైన్ కరకట్ట రహదారి
రూ.1.37 కోట్లతో అవనిగడ్డలో సీమాక్ కేంద్రం ఏర్పాటు
అవనిగడ్డలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు
రూ.3.20 కోట్లతో అవనిగడ్డలో సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం
రూ.15 లక్షలతో అవనిగడ్డ ఏరియా వైద్యశాలలో ఆక్సిజన్ కేంద్రం ఏర్పాటు
రూ.2 కోట్లతో అవనిగడ్డలో అగ్రి పరిశోధన కేంద్రం ఏర్పాటు
రూ.42.02 కోట్లతో 77 సచివాలయాలు, ఆర్‌బీకేల నిర్మాణం
రూ.53.90 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు ఆధునికీకరణ
దివిసీమకు భద్రత, భరోసా.. ‘ఆ ఇద్దరే’


