రెండు లారీలు ఢీ : ముగ్గురికి గాయాలు
కొణకంచి క్రాస్‌రోడ్స్(పెనుగంచిప్రోలు): రెండు లారీలు ఢీ కొనడంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలైన ఘటన మండల పరిధిలోని కొణకంచి క్రాస్ రోడ్స్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ కొణకంచి గ్రామంలో నుంచి జాతీయ రహదారి పైకి వస్తున్న లారీని ప్రమాదవశాత్తూ వెనుక వైపు నుంచి ఢీ కొంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీడ్రైవర్ నల్గొండ జిల్లా మునగాలకు చెందిన పాలకూర శ్రీశైలం తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో నందిగామ ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి విజయవాడ తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు లారీలు ఢీ : ముగ్గురికి గాయాలు


