కార్తిక శోభ | - | Sakshi
Sakshi News home page

కార్తిక శోభ

Nov 4 2025 8:13 AM | Updated on Nov 4 2025 8:13 AM

కార్త

కార్తిక శోభ

కార్తిక శోభ మండల దీక్షల స్వీకరణకు తరలివస్తున్న భక్తులు

దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి సంధ్యారాణి ముక్క చీరలు విక్రయిస్తే చర్యలు : ట్రస్ట్‌బోర్డు

మండల దీక్షల స్వీకరణకు తరలివస్తున్న భక్తులు

విజయవాడ దుర్గా ఘాట్‌లో కార్తిక శోభ నెలకొంది. కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారు జామునే పెద్ద సంఖ్యలో భక్తులు కృష్ణానదికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించి, పూజలు చేసి నదిలో దీపాలను వదిలారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయవాడ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ వారి మండల దీక్షల స్వీకరణ కొనసాగుతోంది. ఏకాదశి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 5వ తేదీ బుధవారం వరకు కొనసాగుతుంది. మూడో రోజైన సోమవారం మహా మండపం ఆరో అంతస్తులోని ఉత్సవ మూర్తి వద్దకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి భవానీ దీక్షలను స్వీకరించారు. దీక్షల స్వీకరణకు విచ్చేసిన భక్తులతో దీక్షా మండపం అరుణ వర్ణాన్ని సంతరించుకుంది. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకుని ఉత్సవ మూర్తి వద్ద దీక్షలను స్వీకరించారు. బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు భవానీ దీక్షలను స్వీకరించే అవకాశం ఉందని ఆలయ అర్చకులు పేర్కొంటున్నారు.

దుర్గమ్మ సేవలో మంత్రి సంధ్యారాణి

మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుటుంబ సమేతంగా సోమవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగ తం పలికారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగ తం పలకగా, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు జరిపించుకున్నారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఈవో శీనానాయక్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.

అన్నదానం, లడ్డూ పోటులను

పరిశీలించిన ట్రస్ట్‌ బోర్డు

దుర్గగుడి అభివృద్ధి పనుల్లో భాగంగా మహా మండపం వద్ద నిర్మాణంలో ఉన్న లడ్డూపోటు, అన్నదాన భవనాలను దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌ రాధాకృష్ణ, సభ్యులు, ఆలయ అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ నెల 7వ తేదీన ట్రస్ట్‌ బోర్డు సమావేశం నేపథ్యంలో ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రస్తుతం లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్న బుద్దా వారి గుడి సమీపంలోని ప్రసాదాల వంటశాలను పరిశీలించారు. అనంతరం మహామండపం ఎదుట నిర్మాణంలో ఉన్న లడ్డూపోటును, అన్నదా నం భవనాలను పరిశీలించారు. కనకదుర్గనగర్‌, గోశా ల వద్ద ఉన్న దుకాణాలను పరిశీలించారు. ఆయా దుకాణాలలో భక్తులకు విక్రయిస్తున్న పేపరు ముక్క చీరలను ట్రస్ట్‌బోర్డు సభ్యులు, చైర్మన్‌ పరిశీలించారు. భక్తులను ఈ విధంగా మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చీరలను విక్రయించే వారి పై కఠిన చర్యలు తీసుకునేలా బోర్డు సమావేశంలో చర్చించాలని సూచించారు. గోశాల వద్ద దుకాణాలు ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని వ్యాపారాలు చేయడంపై ట్రస్ట్‌బోర్డు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దేవస్థాన ఇంజినీరింగ్‌ అధికారులు ఎందుకు చర్యలు తీసు కోవడం లేదని ప్రశ్నించారు. పర్యటనలో దేవస్థాన అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

కార్తిక శోభ 1
1/5

కార్తిక శోభ

కార్తిక శోభ 2
2/5

కార్తిక శోభ

కార్తిక శోభ 3
3/5

కార్తిక శోభ

కార్తిక శోభ 4
4/5

కార్తిక శోభ

కార్తిక శోభ 5
5/5

కార్తిక శోభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement