సెపక్‌తక్రా ఓవరాల్‌ చాంపియన్‌ కృష్ణా | - | Sakshi
Sakshi News home page

సెపక్‌తక్రా ఓవరాల్‌ చాంపియన్‌ కృష్ణా

Nov 4 2025 8:13 AM | Updated on Nov 4 2025 8:13 AM

సెపక్

సెపక్‌తక్రా ఓవరాల్‌ చాంపియన్‌ కృష్ణా

సెపక్‌తక్రా ఓవరాల్‌ చాంపియన్‌ కృష్ణా బీరువా పగలగొట్టి బంగారు, వెండి వస్తువులు చోరీ గంజాయి కలిగి ఉన్న నలుగురి అరెస్ట్‌

ఉరవకొండరూరల్‌: రెండు రోజులుగా ఉరవకొండ సెంట్రల్‌ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అండర్‌ –14, 19 రాష్ట్ర స్థాయి సెపక్‌ తక్రా బాలబాలికల క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 280 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్‌ –19 బాలబాలికల విభాగంలో కృష్ణా జిల్లా మొదటి స్థానం, రెండో స్థానంలో అనంతపురం, మూడో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లా జట్లు నిలిచాయి. అండర్‌– 14 బాలుర విభాగంలో మొదటి స్థానంలో తూర్పు గోదావరి, రెండో స్థానంలో పశ్చిమ గోదావరి, మూడో స్థానంలో కర్నూలు, బాలికల విభాగంలో మొదటి స్థానంలో నెల్లూరు, రెండో స్థానంలో పశ్చిమ గోదావరి, మూడో స్థానంలో అనంతపురం జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు ఆల్‌ ఇండియా సెపక్‌ తక్రా పెడరేషన్‌ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కృష్ణా జిల్లా ఏపీ స్కూల్‌ గేమ్స్‌ పరిశీలకుడు రమేష్‌, ఉరవకొండ ఎంఈఓలు ఈశ్వరప్ప, రమాదేవి, పాఠశాల హెచ్‌ఎం రాజేశ్వరి, ఎస్‌కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సత్యనారాయణ ట్రోఫీ, మెడల్స్‌ ప్రదానం చేశారు. పోటీలను పీడీలు మారుతీ ప్రసాద్‌, పుల్లా రాఘవేంద్ర, ప్రభాకర్‌, చంద్రశేఖర్‌ రెడ్డి, నాగరాజు, ముద్దలాపురం శివ తదితరులు పర్యవేక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించే ఏపీ జట్టుకు ఎంపిక చేశారు.

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): బీరువా పగలగొట్టి బంగారు, వెండి, నగదు చోరీకి గురైన ఘటన సోమవారం జక్కంపూడి కాలనీలో చోటుచేసుకుంది. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జక్కంపూడి కాలనీలో బ్లాక్‌ నంబర్‌ 208లో షేక్‌.నాగూర్‌బీ, మస్తాన్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. మస్తాన్‌ ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్‌ షాపులో పని చేస్తుంటాడు. సోమవారం ఉదయం భార్యాభర్తలు పనులకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన మస్తాన్‌కు తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో ఇంటి లోపలకు వెళ్లి చూడగా, బీరువా తాళాలు విరగొట్టి అందులోని వస్తువులను చిందర వందరగా పడేసి ఉన్నాయి. బీరువాలో దాచిన 12 గ్రాముల బంగారపు వస్తువులు, 15 తులాల వెండి పట్టీలు, రూ.10 వేల నగదు కనిపించలేదు. దీంతో వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

పెనమలూరు: పోరంకిలో గంజాయి కలిగి ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ ఉషారాణి తెలిపిన వివరాల ప్రకారం పోరంకి బీజేఆర్‌ నగర్‌ వద్ద పోలీస్‌ సిబ్బంది పర్యటిస్తుండగా సంచితో ఉన్న ఏడుగురు వ్యక్తులు పారిపోయే యత్నం చేశారు. వారిలో నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకోగా ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. దొరికిన వ్యక్తుల వద్ద సంచి స్వాధీనం చేసుకోని తనిఖీ చేయగా అందులో కేజీన్నర గంజాయి గుర్తించారు. నిందితులపై కేసు నమో దు చేసి అరెస్ట్‌ చేశారు. పరారైన ముగ్గురు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సెపక్‌తక్రా ఓవరాల్‌ చాంపియన్‌ కృష్ణా 1
1/1

సెపక్‌తక్రా ఓవరాల్‌ చాంపియన్‌ కృష్ణా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement