ఎస్జీఎఫ్ తైక్వాండో పోటీల్లో అక్కా చెల్లెళ్ల ప్రతిభ
ఇబ్రహీంపట్నం: రాష్ట్ర స్థాయి స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ తైక్వాండో పోటీల్లో ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు ఉత్తమ ప్రతిభ చాటి బంగారు, రజత పతకాలు సాధించారు. ఈ నెల 1, 2 తేదీల్లో ఏలూరులో జరిగిన అండర్–17 పోటీలో చెల్లెలు కలతోటి దామిని బంగారు పతకం సాధించింది. గత 26, 27 తేదీల్లో రైల్వే కోడూరులో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో అండర్–19 పోటీల్లో అక్క కలతోటి హాసిని రజత పతకం కై వసం చేసుకుంది. బంగారు పతకం సాధించిన దామిని జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై ంది. దామిని గుణదల డాన్‌బాస్కో పాఠశాలలో తొమ్మిదో తరతగతి చదువుతుండగా, అక్క హాసిని గుంటూరులో ఇంటర్మీడియెట్ చదువుతున్నట్లు తల్లిదండ్రులు రమేష్‌బాబు, స్నేహలత తెలిపారు. ఉమ్మడి కృష్ణాజిల్లా తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి ఎం.అంకమ్మరావు, పసుపులేటి గౌరీశంకర్ కోచింగ్‌లో తైక్వాండో పోటీల్లో తమ పిల్లలు రాణిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. దామిని అరుణాచలప్రదేశ్‌లో జరుగనున్న జాతీయస్థాయిలో పాల్గొని రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర స్థాయిలో
బంగారు, రజత పతకాలు సొంతం
ఎస్జీఎఫ్ తైక్వాండో పోటీల్లో అక్కా చెల్లెళ్ల ప్రతిభ


