పోట్రైట్ చిత్ర కళాకారుడు సన్నాలకు ఘన నివాళి
మధురానగర్(విజయవాడసెంట్రల్): ప్రముఖ పో ట్రైట్ చిత్రకారుడు సన్నాల సత్యనారాయణ వరప్రసాద్‌కు ఆదివారం చిత్రకారులు పోట్రైట్ చిత్రాలతో ఘనంగా నివాళులర్పించారు. ముత్యాలంపాడు ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఎంఎస్ మూర్తి ఆర్ట్ గ్యాలరీలో ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య, జీఆర్‌కే పోలవరపు సాంస్కృతిక సమితి, ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ ఎంఎస్ మూర్తి ఆర్ట్ గ్యాలరీ ఆధ్వర్యంలో సన్నాల సత్యనారాయణ వరప్రసాద్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 25 మంది ప్రోట్రైట్ చిత్రకారులు సన్నాల పోట్రైట్ చిత్రాలను గీసి నివాళులర్పించారు. జీఆర్‌కే పోలవరపు సాంస్కృతిక సమితి కార్యదర్శి గోళ్ల నారాయణరావు అధ్యక్షతన సన్నాల సంస్మరణ సభ జరిగింది. అనంతరం పోట్రైట్ చిత్రాలు గీసిన చిత్రకారులకు సర్టిపికెట్లు అందజేశారు. ఆంధ్రా అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ కార్యదర్శి ఎంవీ సాయిబాబు చిత్రకారులు టీవీ, జీవన్ గోషిక, విజయకుమార్, బాలయోగి, మురళీకృష్ణ, రాము అలహరి, కళాసాగర్ రాజు, చిత్రాలయ రాంబాబు, కాంతారావు, సునీల్‌కుమార్, సర్వేశ్వరరావు పాల్గొన్నారు.
పోట్రైట్ చిత్ర కళాకారుడు సన్నాలకు ఘన నివాళి


