
టీడీపీ నుంచి వలసలుగా వైఎస్సార్ సీపీలోకి..
పామర్రు: టీడీపీ నేతల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను తట్టుకోలేక ఆ పార్టీ నుంచి వలసలుగా ప్రజలు వైఎస్సార్ సీపీలోకి వస్తున్నారని పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్ అన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే గృహంలో మొవ్వ మండలం నిడుమోలు గ్రామానికి చెందిన టీడీపీ మైనార్టీ నాయకులు వైఎస్సార్ సీపీలోకి చేరారు. తొలుత అనిల్ కుమార్‌తో వారు కొద్ది సేపు మాట్లాడి అనంతరం పార్టీ కండువాలను కప్పుకున్నారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వైఎస్సార్ సీపీకి ప్రజలలో లభిస్తోన్న ఆదరణకు ఈ చేరికలే సంకేతాలన్నారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఆ పార్టీలు 17 నెలలకే ప్రజాగ్రహానికి గురయ్యాయని విమర్శించారు. ప్రస్తుతం ప్రజల్లో వైఎస్సార్ సీపీ పట్ల పూర్తి విశ్వాసం వ్యక్తం అవుతోందన్నారు.
మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్ కుమార్