
ముగిసిన ఖోఖో శిక్షణ శిబిరం
గన్నవరం: స్థానిక జెడ్పీ బాలుర హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో గత వారం రోజులుగా జరుగుతున్న రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు శిక్షణ శిబిరం మంగళవారం ముగిసింది. సౌత్ జోన్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కోచ్‌లు టి. శ్రీనివాసరావు, షేక్ మీరాసాహెబ్ నేతృత్వంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు కర్ణాటకలోని దార్వాడ్‌లో జరిగే సౌత్‌జోన్ పోటీల్లో ఈ జట్టు పాల్గొంటుందన్నారు. ఈ పోటీల్లో మహిళల జట్టు అత్యుత్తమ క్రీడా నైపుణ్యం కనబరిచి విజయంతో తిరిగిరావాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళల జట్టు కర్ణాటకకు బయలుదేరివెళ్లింది. వ్యాయామ విద్య ఉపాధ్యాయులు ధనియాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.