ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ రామచంద్రనగర్‌కు చెందిన బత్తుల బాలాత్రిపుర సుందరి కుటుంబం ఆలయ ఈఓ శీనానాయక్‌ను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళం అందజేసింది. తూర్పుగోదావరి జిల్లా వెంకటాయపాలేనికి చెందిన ముక్కామల నారాయణమూర్తి, విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి నిత్యాన్నదానానికి రూ.1,81,500 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
దుర్గమ్మకు కాసుల పేరు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన భక్తులు శనివారం రూ.4 లక్షల విలువైన బంగారు కాసుల పేరును కానుకగా సమర్పించారు. వరంగల్‌కు చెందిన జి.రామకృష్ణ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ అధికారులను కలిసి సుమారు 34 గ్రాముల బంగా రంతో రూ.4 లక్షలతో తయారు చేయించిన కాసులపేరును అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈఓ వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
స్వచ్ఛాంధ్రకు సహకరించాలి
లక్ష్మీపురం(తిరువూరు): పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రజలు సహకరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ కోరారు. తిరువూరు మండలం లక్ష్మీపురంలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో ఇంకుడు గుంతల పనులను పరిశీలించిన అనంతరం గ్రామస్తులతో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణకు ఇంటింటా మొక్కలు నాటాలని, స్వచ్ఛమైన గాలి పీలిస్తే సగం రోగాలు దరిచేరవని కలెక్టర్ సూచించారు. తడి, పొడి చెత్త సేకరించి కంపోస్ట్ యూనిట్‌కు తరలించాలని, రోడ్లపై చెత్త పారబోయవద్దని కోరారు. ఎమ్మెల్యే శ్రీనివాసరావు, ఆర్డీఓ మాధురి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుహాసిని, డీపీఓ లావణ్య, ఎంపీపీ గద్దల భారతి, సర్పంచి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్‌కు జగ్గయ్యపేట విద్యార్థుల ప్రాజెక్టు
జగ్గయ్యపేట అర్బన్: జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్‌కు జగ్గయ్యపేట పట్టణానికి చెందిన జీవీజే జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్ట్ ఎంపికైంది. వరద ప్రవాహాల నుంచి వాహ నాలు, వంతెనలను కాపాడే వ్యవస్థపై గైడ్ టీచర్ గార్లపాటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బాలుర హైస్కూల్ విద్యార్థులు ఎం.నాగ తేజ, వై.భార్గవ్ ధనుష్ రూపొందించిన ప్రాజెక్టు నవంబర్‌లో మధ్యప్రదేశ్ రాష్ట్రం, భోపాల్‌లో జరిగే జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై ందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.వి.నాగేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌కు పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
దుర్గమ్మకు విరాళాలు
దుర్గమ్మకు విరాళాలు
దుర్గమ్మకు విరాళాలు