
మీకోసంలో 32 ఫిర్యాదులు
కోనేరుసెంటర్: మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని జిల్లా అడిషనల్ ఎస్పీ వి.వి.నాయుడు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసంలో పాల్గొన్న ఆయన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీకోసంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును చట్టపరిధిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను ఆయన సావధానంగా ఆలకించారు. కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని ఫిర్యాదులను సంబంధిత అధికారులకు ఫోన్‌లో సిఫార్సు చేశారు.