
జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు
చిలకలపూడి(మచిలీపట్నం): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం జెడ్పీ కన్వెన్షన్ హాలులో వాణిజ్య పన్నులశాఖ ఆధ్వర్యంలో షాపింగ్ ఫెస్టివల్‌ను కలెక్టర్ డీకే బాలాజీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కన్వెన్షన్ హాలులో ఏర్పాటుచేసిన వ్యాపారస్తుల ప్రదర్శనను సంద ర్శించి ధరల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో పన్నుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిందన్నారు. 2014లో ఒకే దేశం ఒకే పన్ను విధానంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ అమలు చేసిందని, ఈ విధానంలో కేంద్ర ప్రభుత్వమే పన్నులు వసూలు చేసి రాష్ట్రాలకు వాటాను పంపిణీ చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఎస్టీ తగ్గింపుతో రూ.8 వేల కోట్ల ఆదాయం తగ్గిపోతున్నప్పటికీ ప్రజల కోసం తగ్గింపు ధరలను అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయ పరికరాలపై కూడా భారీగా ధరలు తగ్గాయన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ ప్రతి సామాన్యుడు ఆనందకరమైన జీవనాన్ని గడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీఎస్టీ తగ్గించిందన్నారు. కార్య క్రమంలో జీఎస్టీ ప్రచార కమిటీ జిల్లా కో–ఆర్డినేటర్ కల్పన, అడిషనల్ కమిషనర్ బాబ్జిబాబు, సీఈవో కన్నమనాయుడు, డెప్యూటీ సీఈవో ఆనందకుమార్, మెప్మా పీడీ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కొల్లు రవీంద్ర