
● జంక్షన్ జలమయం
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో హనుమాన్‌జంక్షన్‌లో రహదారులు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై సుమారు మూడు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. హనుమాన్‌జంక్షన్ ప్రధాన కూడలిలో వర్షపు నీరు నిలవటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నూజివీడు రోడ్డు, గుడివాడ రోడ్డులో డ్రెయినేజీ పొంగిపొర్లటంతో దుకాణాల్లోకి నీళ్లు వచ్చాయి. విజయవాడ రోడ్డులో వేలేరు క్రాస్‌రోడ్డు నుంచి పాల శీతల కేంద్రం వరకు రహదారి కాలువను తలపించింది. బాపులపాడు, మహాత్మగాంధీ నగర్, తారకరామ కాలనీ, బండారుగూడెం, పెరికీడు గ్రామాల్లోనూ అంతర్గత రహదారులన్నీ జలమయమయ్యాయి.
–హనుమాన్‌జంక్షన్ రూరల్