
ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీధి వీధినా బెల్టుషాపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయంగా ఎంచుకుంది. పాలకులు ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా కల్తీ మద్యం సరఫరా జరగదు. ప్రభుత్వ సహకారంతో కొందరు పెద్దలు ప్రజల సొమ్మును అడ్డదారిలో దోచేస్తున్నారు.
– గుర్రం కుమారి, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు, కంకిపాడు, కృష్ణాజిల్లా