
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ
మీ–కోసంలో కలెక్టర్ బాలాజీ ప్రజల నుంచి 109 అర్జీల స్వీకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజల నుంచి వచ్చే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో, నాణ్యంగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ – కోసం) కార్యక్రమం జరిగింది. కలెక్టర్ బాలాజీతో పాటు జేసీ ఎం.నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ ఎస్‌డీసీ శ్రీదేవి, ఆర్డీఓ స్వాతి, హౌసింగ్ పీడీ పోతురాజు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తొలుత కలెక్టర్ మాట్లాడుతూ.. కొంత మంది జిల్లా అధికారులు అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. సకాలంలో పరిష్క రించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు కలెక్టరేట్‌లో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అధికారులు, సిబ్బందికి గాజు సీసాలతో తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. జేసీ నవీన్ మాట్లాడుతూ.. గత నెల మూడో శుక్రవారం ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన కార్యక్రమంలో వచ్చిన 22 అర్జీలకు సంబంధించి తీసుకున్న చర్యల నివేదికలను వెంటనే అందజేయాలని కోరారు. మీ–కోసంలో అధికారులు 109 అర్జీలు స్వీకరించారు.
ముఖ్యమైన అర్జీలు ఇవీ..