
నకిలీ మద్యాన్ని అరికట్టాలి
రాష్ట్రంలో నకిలీ మద్యం యథేచ్ఛగా తయారవు తోంది. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా చూస్తోంది. రాష్ట్ర రాజధాని అమరావతికి దగ్గరలోనే నకిలీ మద్యం తయారీ మూలాలను గుర్తించడం గమనార్హం. కల్తీ మద్యం తయారీదారులపై కూటమి ప్రభుత్వం స్పందించి కఠిన చర్యలు తీసుకో వాలి. మద్యం కల్తీని రూపుమాపేలా ఆ చర్యలు ఉండాలి.
– రాజులపాటి పార్వతి,
జెడ్పిటీసీ, మొవ్వ, కృష్ణాజిల్లా