
ఆటో కార్మికులతో చెలగాటం
ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఆటో కార్మికుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా అన్నారు. విజయ వాడ అజిత్‌సింగ్‌నగర్ లోని ఎమ్మెల్సీ కార్యాలయంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్‌కు చెందిన ఆటో కార్మి కులు మర్యాదపూర్వకంగా ఎమ్మెల్సీ రుహుల్లాను కలిశారు. తమకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేయించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ అన్ని వర్గాల కార్మికులకు సంక్షేమాన్ని అందించినది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే అన్నారు. ప్రస్తుతం చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉందని, కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తోందని విమర్శించారు. ఆటో కార్మికుల సమస్యలపై త్వరలో జరగనున్న శాసనమండలి సమావేశాలలో ప్రస్తావిస్తామన్నారు. పలువురు ఆటో కార్మికుల మాట్లాడుతూ తమకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం లోనే సంతోషంగా ఉందని, ఈ ప్రభుత్వంలో సరైన ఉపాధి లేకుండా పోయిందని వాపోయారు.
ఐటీఐలో ప్రవేశానికి
దరఖాస్తు చేసుకోండి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశానికి నాల్గో విడత అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టామని విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకరావు ఓ ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటుగా 8వ తరగతి ఉత్తీర్ణులైన వారికి కూడా ఐటీఐలో ప్రవేశానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 27వ తేదీలోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకో వాలని తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో చేరాలనుకునే వారికి ఈ నెల 29వ తేదీ, ప్రైవేటు ఐటీఐలో జాయిన్ కావాలనుకునే వారికి ఈ నెల 30వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇతర వివరాలకు 0866–2475575, 94906 39639, 77804 29468లో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.
మరో ముగ్గురికి
డయేరియా లక్షణాలు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): న్యూరాజరాజేశ్వరీపేటలో డయేరియా నిలకడగా ఉంది. మంగళవారం నలభై మంది వరకూ అనారోగ్యాలతో వైద్య పరీక్షలు చేయించుకోగా వారిలో ఇద్దరికి వాంతులు, మరో ముగ్గురికి విరేచనాలతో బాధపడుతుండగా.. ముగ్గురికి మాత్రమే డయేరియా లక్షణాలు కనిపించాయి. ఆరోగ్య శాఖ అధికారులు బాధితులకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు.
ఇంకా తెలియని కారణం..
న్యూఆర్‌ఆర్‌పేటలో ‘డయేరియా’కు గత కారణాలు ఇంకా తెలియకపోవడంతో అధికారులు సింగ్‌నగర్, న్యూఆర్‌ఆర్‌పేటలోని మాంసం దుకాణాలు, బిర్యానీ హోటళ్లు, టీ సెంటర్లు, బేకరీలు, తినుబండరాల వ్యాపారాలతో పాటు బార్లు, వైన్ షాపులను మూసి వేయించారు.