పోలీసుల బందోబస్తు
పెనమలూరు: పోరంకి గ్రామంలో శనివారం అధికారులు అరకొరగా యూరియాను రైతులకు పంపిణీ చేశారు. గ్రామంలో రైతులు గత కొద్ది రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే 10 టన్నుల యూరియా రావటంతో సమాచారం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో రైతుసేవా కేంద్రానికి తరలివచ్చారు. దీంతో ఏవో శైలజ యూరియా 10 టన్నులు వచ్చిందని, అరకట్ట నుంచి గరిష్టంగా 3 కట్టల యూరియా ఇస్తామని తెలిపారు. అయితే రైతులు యూరియా అవసరం చాలా ఉందని, అరకొరగా ఇస్తే సాగు ఎలా చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. దశలవారీగా యూరియా పంపిణీ చేస్తామని ఏవో రైతులకు తెలిపారు. రైతు సేవా కేంద్రాల వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో రావటంతో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు.
గుడివాడటౌన్: ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన క్రీడాకారులకు జిల్లా స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఈనెల 21వ తేదీన నిర్వహిస్తున్నట్లు స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు తెలిపారు. స్టేడియం కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్టేడియం క్రీడా క్యాలెండర్‌ను అనుసరించి ఉమ్మడి కృష్ణాజిల్లా క్రీడాకారులు పురుషులు, సీ్త్రలకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీలలో విజేతలకు పతకాలతో పాటు సర్టిఫికెట్‌లు అందజేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొనవలసినదిగా ఆయన కోరారు. పూర్తి వివరాలకు 85220 99995ను సంప్రదించవలసిందిగా కోరారు.