
రోడ్డు ప్రమాదంలో పాస్టర్ దుర్మరణం
కప్తానుపాలెం(మోపిదేవి): మండలంలోని కప్తానుపాలెం వద్ద 216 జాతీయ రహదారిపై శనివారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ కొక్కిలిగడ్డ జక్రయ్య(54) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా జువ్వలపాలెంకు చెందిన జక్రయ్యబాబు తన అత్తగారి ఊరు అయిన చల్లపల్లి మండలం పాగోలుకు పనిమీద వచ్చి ద్విచక్రవాహనంపై తిరిగి వెళుతుండగా మార్గంమధ్యలో కప్తానుపాలెం వద్ద ఎదురుగా వస్తున్న కారుని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో జక్రయ్యబాబు అక్కడికక్కడే మృతి చెందారు. అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ, చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలంకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య మహాలక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.