
కానిస్టేబుల్స్‌గా ఎంపికై న హోంగార్డుల పిల్లలకు అభినందన
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కానిస్టేబుల్స్ ఫలితాల్లో నగరంలో పనిచేస్తున్న హోంగార్డుల పిల్లలు ఎంపికయ్యారు. వారిని మంగళవారం పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, డీసీపీ కేజీవీ సరితలు అభినందనలు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే సివిల్ కానిస్టేబుల్స్‌గా ఎంపికై న హోంగార్డు వంగూరి చిట్టిబాబు ఇద్దరు కుమార్తెలు రత్నశ్రీ, జయశ్రీలను ప్రత్యేకంగా అభినందించారు. జి. కొండూరు మండలం, బీమావరప్పాడుకు చెందిన వంగూరు చిట్టిబాబు 1991 నుంచి హోంగార్డుగా పనిచేస్తూ ముగ్గురు కుమార్తెలను చదివించాడు. వారిలో ఇద్దరు ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్స్‌గా ఎంపికవడం పట్ల సీపీ, డీసీపీలు అభినందనలు తెలిపారు. కాగా మరో ఇద్దరు హోంగార్డులు అస్లామ్ బేగ్ కుమారుడు మొగల్ అబ్దుల్ అలీం బేగ్, రాఘవులు కుమారుడు పూర్ణనాగార్జున కూడా కానిస్టేబుల్‌గా సెలెక్ట్ కావడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు.