
ఉద్యోగ విరమణ చేసిన అధికారులకు సత్కారం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్య ఆరోగ్యశాఖలో హెల్త్ ఎడ్యుకేషన్ మీడియా అధికారులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన పలువురికి ఏపీ హెల్త్ ఎడ్యుకేషన్, మీడియా అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌లో అసోసియేషన్ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ నాగేశ్వరరావు, మురళీధర్‌ల నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత సంఘం సాధించిన ప్రగతి కార్యకలాపాలపై చర్చించారు. సంఘ సభ్యుల అభ్యున్నతికై పలు తీర్మానాలు చేశారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసిన ఆర్. రాజేశ్వరితో పాటు, జె.రఘురామ్, వి.సుభావతి, పి.రత్నకుమారి, ఎస్. భానుమూర్తి, వసంతరావును సత్కరించారు. ఈ సదస్సులో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు రామాంజనేయులు, తెలంగాణ వైద్యశాఖ మీడియా అధికారుల సంఘం అధ్యక్షుడు కొప్పు ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సంఘ కోశాధికారి నరేంద్ర శేషు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె. ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.