చిలకలపూడి(మచిలీపట్నం): ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బీమా పరిహారం పొందేందుకు రైతులు స్వచ్ఛందంగా పంట బీమా పథకంలో చేరవచ్చని జిల్లా వ్యవసాయాధికారి మనోహర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ భూమి ఉన్న యజమాని, సీసీఆర్‌సీ కార్డు పొందిన కార్డుదారులు ఈ పథకంలో చేరడానికి అర్హులన్నారు. పంట రుణం తీసుకున్న రైతులకు అదనంగా బీమా ప్రీమియం కూడా మంజూరు చేస్తామన్నారు. పంట రుణం తీసుకోని రైతులు కామన్ సర్వీస్ సెంట ర్లు, బ్యాంకుల్లో ప్రీమియం చెల్లించి జాతీయ పంట బీమా పోర్టల్‌లో నమో దు చేసుకుని ఈ పథకంలో చేరవచ్చని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో కూడా ప్రీమియం చెల్లించవచ్చన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద నోటిఫై చేసిన పంటలకు ఈ బీమా సౌకర్యం లభిస్తుందన్నారు.
పంట బీమాను సద్వినియోగం చేసుకోండి