మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా | - | Sakshi
Sakshi News home page

మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా

Jun 5 2025 8:10 AM | Updated on Jun 5 2025 8:10 AM

మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా

మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా

కోనేరుసెంటర్‌: జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పొరుగు రాష్ట్రాల మద్యం ఏరులై పారుతోంది. మద్యం దందాలో ఆరితేరిన వ్యాపారులు కొందరు ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని పెద్దఎత్తున మచిలీపట్నంకు దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని బార్‌లు, వైన్‌షాపుల్లో బహిరంగంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మచిలీపట్నంలో నాన్‌డ్యూటీ పెయిడ్‌ మద్యం ఏరులై పారుతున్నా ఎకై ్సజ్‌ అధికారులు పట్టించుకోకపోవటం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. కొన్ని బ్రాండ్లకు సంబంధించి మద్యం ధరలు మన రాష్ట్రంలో కన్నా ఇతర రాష్ట్రాల్లో తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి దొడ్డిదారిన సీసాలు దింపుకొని విచ్చలవిడిగా విక్రయాలు జరిపేస్తూ ప్రజా ధనాన్ని దోచేస్తున్నారు.

తిలా పాపం తలా పిడికెడు

బందరు నియోజకవర్గంలో 9 రెస్టారెంట్‌ అండ్‌ బార్‌లు, తొమ్మిది వైన్‌షాపులు ఉన్నాయి. ఇటీవల బందరు మండలం సుల్తానగరంలోని ఓ వైన్‌షాపుపై ఎకై ్సజ్‌ అధికారులు దాడి చేసి ఎన్‌పీడీ బాటిళ్లను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. కానీ అధికారులు అధికార పార్టీ నేతలకు భయపడి అవి వైన్‌షాపునకు సమీపంలోని ఓ బెల్టుషాపులో దొరికినట్టు చిత్రీకరించి కేసు నమోదు చేసి చూపించారు. అందుకు షాపు యజమాని నుంచి ఎకై ్సజ్‌ అధికారులకు భారీగా మామూళ్లు అందినట్లు సమాచారం. మరో ఘటనలో నగరంలోని ఓ జనసేన నాయకుడికి సంబంధించిన బార్‌లో అర్ధరాత్రి అమ్మకాలు జరుగుతుండగా నైట్‌రౌండ్స్‌లో ఉన్న ఓ పోలీసు అధికారి రైడ్‌ చేసి దాదాపు 250కి పైగా సీసాలను పట్టుకున్నట్లు సమాచారం. అయితే సదరు బార్‌ యజమాని సంబంధిత పోలీసుస్టేషన్‌కు ఇచ్చే నెలవారీ మామూళ్లను అందరి ఎదుట ఎండగట్టటంతో పాటు జనసేన పార్టీకి చెందిన ఓ పెద్ద నాయకుడితో ఫోన్‌ చేయించి బాటిళ్లు పట్టుకున్న అధికారిని గజగజలాడించినట్లు తెలుస్తోంది. దీంతో చేసేది లేక ఆ అధికారి అర్ధరాత్రి అమ్మకాలు జరుపుతున్నట్లు కేసు నమోదుచేసి పట్టుకున్న బాటిళ్లు మొత్తం బార్‌లోకి పంపినట్లు మద్యం వ్యాపారులు చెప్పుకుంటున్నారు. ఈ కేసుకు సంబంఽధించి సంబంధిత అధికారికి పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టినట్లు ప్రచారం లేకపోలేదు. గత సోమవారం విజయవాడకు చెందిన స్పెషల్‌ టీంలు మచిలీపట్నంలోని బస్టాండ్‌ సెంటర్‌, విజయవాడ రోడ్డులోని బార్‌లపై దాడులు చేసి చివరికి ఏమీ లేవని తేల్చి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే సదరు షాపుల్లోనూ ఎన్‌పీడీ బా టిళ్లను గుర్తించిన అధికారులు పెద్ద మొత్తంలో సంచులు అందుకుని ఆ రెండు బార్‌లకు గుడ్‌ కాండక్ట్‌ సర్టిఫికెట్‌లు ఇచ్చి నట్లు తెలుస్తోంది.

300కు పైగా బెల్టు షాపులు

బందరు నియోజకవర్గంలోని అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో బార్‌, వైన్‌షాపులతో పాటు దాదాపు 300కు పైగా బెల్టుషాపులు ఉన్నట్లు సమాచారం. సదరు బెల్టుషాపులకు ఎన్‌పీడీ బాటిళ్లను సరఫరా చేసి బెల్టుషాపు నిర్వాహకుల ద్వారా వ్యాపారులు అమ్మిస్తున్నారు. అలా పట్టణంతో పాటు పల్లెల్లోనూ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం ఏరులై పారుతోంది. ఇదంతా ఎకై ్సజ్‌ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రతి నెలా లక్షల్లో ముడుపులు

మచిలీపట్నంలోని మద్యం దుకాణాల్లో జరి గే అక్రమ మద్యం అమ్మకాల వైపు చూడకుండా ఉండేందుకు బందరు సిండి‘‘కేటు’’లు సంబంధిత అధికారులకు లక్షల్లో పారితోషికాలు అందజేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఎన్‌పీడీ అమ్మకాలతో పాటు సమయ పాల నతో సంబంధం లేకుండా చేసుకునే వ్యాపారానికి అడ్డురాకుండా ఉండేందుకు ప్రతి నెలా ఎకై ్సజ్‌ శాఖకు ఒక్కో దుకాణం తరఫున రూ.20,000 చొప్పున అన్ని షాపులకు సంబంధించి నెలకు రూ. 3,60,000, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులకు ఒక్కో దుకాణం తరపున రూ.8,000 చొప్పున రూ.1,44, 000, ఇతర సిబ్బందికి రూ.6,000 చొప్పున రూ.1,06,000 ముట్టజెబుతున్నట్లు సిండికేట్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అడ్డగోలు అమ్మకాలతో

జనం ధనం దోపిడీ

ఇతర రాష్ట్రాల నుంచి

మద్యం బాటిళ్లు దిగుమతి

బార్‌లు, వైన్‌షాపులతో పాటు బెల్టుషాపుల్లోనూ విక్రయాలు

మామూళ్ల మత్తులో జోగుతున్న ఎకై ్సజ్‌ అధికారులు

మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా రెచ్చిపోతోంది. ఎకై ్సజ్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతో మద్యంమాఫియా పేట్రేగిపోతోంది. మన రాష్ట్రం నుంచి అందుతున్న మద్యం చాలదన్నట్లు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని దిగుమతి చేసుకుని మరీ అమ్ముకుంటోంది. సామాన్యుడిని మద్యం మత్తులో ముంచి మద్యం మాఫియా, ఎకై ్సజ్‌ అధికారులు కలసి కోట్లు కొల్లగొడుతూ తమ జేబులు నింపుకొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement