ఎన్టీటీపీఎస్‌కు రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ సంస్థకు రాష్ట్ర స్థాయి ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు వరించింది. విజయ వాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి విజయానంద్, ఏపీ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ నాగలక్ష్మి, సీపీడీసీఎల్ చైర్మన్ పుల్లారెడ్డి చేతుల మీదుగా ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ పి.శివరామాంజనేయులు శనివారం అవార్డు అందుకున్నారు. థర్మల్ ప్లాంటులో శక్తి వినియోగాన్ని తగ్గిస్తూ వినూత్నమైన శక్తి పరిరక్షణ విధానాలు అమలు చేయడం ద్వారా రాష్ట్రస్థాయిలో శక్తి పరిరక్షణ విభాగంలో రెండో స్థానం దక్కించుకుని సిల్వర్ మెడల్ సొంతం చేసుకోవడం సంస్థకు గర్వకారణమని సీఈ శివరామాంజ నేయులు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సీఈకి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు గోపాల్, వెంకటరావు, ఈఈలు సురేష్‌బాబు, శ్రీనివాస్‌రెడ్డి, డీఈఈ హరి పాల్గొన్నారు.


