తిరువూరులో మెగా రక్తదాన శిబిరం
తిరువూరు: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం తిరువూరులో పార్టీ సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తిరువూరు ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలు కళాశాలల విద్యార్థులు, వైఎస్సార్ సీపీ కార్యక ర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు 200 మందికి పైగా రక్తదానం చేశారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు ఈ శిబిరాన్ని ప్రారంభించారు. కౌన్సిలర్ మోదుగు ప్రసాద్, పార్టీ నాయకులు శ్రీనివాసరెడ్డి, కాలసాని గోపాల నాగేశ్వరరావు, వాళ్ల సురేష్ తదితరులు రక్తదాన మిచ్చారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ నల్లగట్ల సుధారాణి, మహిళా విభాగ అధ్యక్షురాలు పురిటిపాటి సుధారాణి, తిరువూరు, విస్సన్నపేట జెడ్పీటీసీ సభ్యులు యరమల రామచంద్రారెడ్డి, బీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి, తిరువూరు, విస్సన్నపేట వైఎస్సార్ సీపీ అధ్యక్షులు తాళ్లూరి నవీన్‌కుమార్, దుర్గారావు, కుటుంబరావు, పార్టీ నాయకులు కలకొండ రవికుమార్, గోగులమూడి చెన్నకేశవరెడ్డి, చావా వెంకటేశ్వరరావు, ఏరువ ప్రకాష్‌రెడ్డి, తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు, ఇనపనూరి రవి, పరసా నెహ్రూ, రాజ్‌మహ్మద్, ఆలపాటి ఉమామహేశ్వరరావు, చెరుకు నరసారెడ్డి, మామిడి కుటుంబరావు, బొర్రా మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


