హెల్త్ వర్సిటీ ఫుట్‌బాల్ జట్టు ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఈ నెల 24 నుంచి కాలికట్‌లోని కాలికట్ విశ్వవిద్యాలయం ఆవరణలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్‌బాల్ (పురుషులు) టోర్నీలో పాల్గొనడానికి తమ యూనివర్సిటీ జట్టును శనివారం ఎంపిక చేశామని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డాక్టర్ ఇ.త్రిమూర్తి ప్రకటనలో తెలిపారు. పి.ప్రసన్న శేషు కుమార్, మితుల్ అమరా, కె.సాయి శ్రీష్, ఎం.జస్వంత్, కె.సాయి లోకేష్ , కె.భావిష్ , కె.వెంకట ప్రణీత్ తేజ, పి.వెంకట సత్య ఆదిత్య, ఎస్‌డి.హర్షవర్థన్, డి.ప్రసన్న సాయి, కె.దినేష్ మణిరాజ్, అఖిల్ ఎం థామస్, టి.కృష్ణప్రకాష్, ఎవిన్ విల్ఫీ, ఎస్.సుధీర్, జిబిన్ బిజు, ఆనందు ఆర్ గోపాల్, సినో సాజి అబ్రహం ఎంపికయ్యారు.
చిలకలపూడి(మచిలీపట్నం): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే శ్రమదానం కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి కలెక్టర్ డి.కె.బాలాజీ పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం చెత్తను తీసుకువెళ్లే ట్రాక్టర్‌ను స్వయంగా నడిపారు. శబ్ద, వాయు కాలుష్యం నివారణలో భాగంగా శనివారం కలెక్టరేట్‌కు వచ్చే ఉద్యోగులు, ప్రజలు నడక, సైకిల్‌పై రావాలని గతంలో కలెక్టర్ కోరారు. దీంతో అధికారులు సైకిళ్లపై విధులకు హాజరయ్యారు. కలెక్టరేట్ పరిసరాలను ప్రతి శనివారం అధికారులు, ఉద్యోగులు శుభ్రం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కె.చంద్రశేకరరావు, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి చిననరసింహులు, వయోజన విద్య ఏడీ బేగ్, జిల్లా పర్యాటక శాఖ అధికారి రామలక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.


