రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
జి.కొండూరు: బైకుపై వెళ్తూ గేదెను ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు జిల్లా తాడికొండ మండలం దామరపల్లికి చెందిన వీసా రాజేష్(26) గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ క్యాటరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం తల్లిదండ్రులను చూసేందుకు సొంత గ్రామానికి వెళ్లిన రాజేష్, తిరుగు ప్రయాణంలో మైలవరం వైపు వస్తున్న క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో జి.కొండూరు శివారులోకి రాగానే 30వ నంబరు జాతీయ రహదారిపై గేదెను ఢీకొని కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్‌ని జి.కొండూరు పోలీసులు 108 అంబులెన్స్‌లో విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ బుధవారం ఉదయం మృతి చెందాడు.
చీకట్లో గేదె కనిపించక...
రహదారిపై గేదెను భారీ వాహనం ఢీకొట్టడంతో గేదె మృతి చెంది రోడ్డుపై పడి ఉంది. అదే సమయంలో అటుగా బైకుపై వస్తున్న రాజేష్‌కు రోడ్డుపై మృతి చెందిన గేదె చీకట్లో కనిపించక ఢీకొట్టి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తండ్రి వీసా భాస్కరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు.


