బీసీ చైతన్య వేదిక నూతన కార్యవర్గం ఎన్నిక
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): బీసీ చైతన్య వేదిక రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన సమావేశంలో కార్యవర్గ ఎన్నిక జరిగింది. బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా పెండ్యాల నారాయణ, మదుగురి సూర్యనారాయణ, మట్టపర్తి సూర్యచంద్రరావు, బొక్కా సత్యనారాయణ, ప్రధానకార్యదర్శిగా లుక్కా వెంకటేష్, కార్యదర్శులుగా నందవరుపు శ్రీనివాసులు, పాల సత్యనారాయణ, పితాని శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులుగా బండి ఆదికృష్ణ, రాయుడు లక్ష్మణరావు, మహిళా అధ్యక్షురాలిగా వడ్డి నాగమల్లేశ్వరియాదవ్, మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలిగా దుర్గముపాటి పద్మజ, మహిళా ప్రధానకార్యదర్శిగా మార్గని సుశీల, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా రాయుడు దుర్గ, రాష్ట్ర మహిళా కార్యనిర్వాహక కార్యదర్శిగా డోలా రాజేశ్వరీదేవి, బీసీ చైత్య వేదిక రాష్ట్ర యూత్ అధ్యక్షుడిగా మరిశెట్టి సూరిబాబు ఎన్నికయ్యారు. వీరికి వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ నియామకపత్రాలు అందజేసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ మండల కమిషన్ సిఫార్సులు పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జనగణనతోపాటు కులగణన చేపట్టి వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు.


