గుడ్లవల్లేరు(గుడివాడ): జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ ఆధ్వర్యంలో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన సెంట్రల్ జోన్ అంతర కళాశాలల క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. రాత్రి విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. పురుషుల, మహిళల విభాగాల్లో వేర్వేరుగా నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల్లో విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, జిల్లాలకు చెందిన వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 198 జట్లు పోటీ పడ్డాయి. విజేతలకు ట్రోఫీలను సెంట్రల్ జోన్ టోర్నమెంట్ చైర్మన్, కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.ప్రసాద్, కన్వీనర్ డాక్టర్ పి.కోదండ రామారావు, సలహాదారు డాక్టర్ పి.రవీంద్రబాబు, డైరెక్టర్ డాక్టర్ బి.కరుణకుమార్ చేతుల మీదుగా అందించారు. పీడీలు వెంకటేష్, పూజిత, శ్రీనివాస్, అధ్యాపకులు, వలంటీర్లు పాల్గొన్నారు. విజేతల వివరాలు టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మత్తి శివశంకర్ తెలిపారు.
పురుషుల విభాగంలో విజేతలు వీరే..
● వాలీబాల్‌లో విన్నర్స్‌గా గోదావరి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ రాజమండ్రి, రన్నర్స్‌గా ప్రగతి ఇంజినీరింగ్ కాలేజీ సూరంపాలెం నిలిచింది.
● కబడ్డీలో విన్నర్స్‌గా అమృత సాయి ఇంజినీరింగ్ కాలేజీ పరిటాల, రన్నర్స్‌గా శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ నిలిచింది.
● టేబుల్ టెన్నిస్‌లో ప్రథమ స్థానంలో యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాకినాడ, రెండోస్థానం శ్రీ వాసవీ ఇంజినీరింగ్ కాలేజీ తాడేపల్లిగూడెం సాధించింది.
● బాల్ బ్యాడ్మింటన్‌లో విన్నర్స్‌గా శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ, రన్నర్స్‌గా ఎస్‌ఆర్‌కే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ నిలిచింది.
మహిళా విభాగంలో విజేతలు వీరే..
● వాలీబాల్‌లో విన్నర్స్‌గా శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ, రన్నర్స్‌గా సెయింట్ మేరీస్ గుంటూరు నిలిచింది.
● కబడ్డీలో ప్రథమ స్థానంలో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ, రెండో స్థానం కాకినాడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సాధించింది.
● టేబుల్ టెన్నిస్‌లో విన్నర్స్‌గా గాయిత్రీ విద్యా పరిషత్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ విశాఖపట్నం, రన్నర్స్‌గా శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ నిలిచింది.
● బాల్ బ్యాట్మంటన్‌లో మొదటి స్థానంలో శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ, రెండో స్థానం గాయిత్రీ విద్యా పరిషత్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ విశాఖపట్నం సాధించింది.


