ఏరియాలో 126శాతం బొగ్గు ఉత్పత్తి | - | Sakshi
Sakshi News home page

ఏరియాలో 126శాతం బొగ్గు ఉత్పత్తి

Mar 3 2026 7:27 AM | Updated on Mar 3 2026 7:27 AM

రెబ్బెన: బెల్లంపల్లి ఏరియా ఫిబ్రవరిలో 126 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని జనరల్‌ మేనేజర్‌ విజయ భాస్కర్‌రెడ్డి తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరిలో ఏరియాకు 3లక్షల టన్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 3.77 లక్షల టన్నులతో 126 శాతం ఉత్పత్తిని సాధించిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలరోజుల వ్యవధిని సద్వినియోగం చేసుకుని, గడువులోగా వందశాతం వార్షిక ఉత్పత్తి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా ఏరియాలో ఉత్పత్తి వేగం పుంజుకుందన్నారు. అధిక వర్షాలతో కోల్పోయిన ఉత్పత్తిని సాధించేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఉత్పాదకతలో బెల్లంపల్లి ఏరియా 99 శాతంతో కొనసాగుతోందని, వందశాతం సాధించేందుకు ఉద్యోగులు, అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్వోటూజీఎం రాజమల్లు, ఐఈడీ డీజీఎం ఉజ్వల్‌కుమార్‌ బెహారా, పర్సనల్‌ హెచ్‌వోడీ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement