ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ పల్లెల్లో సోమవారం పులారా సందడి నెలకొంది. ప్రజలు ఉదయమే ఇళ్లను ఆవుపేడతో అలికి ముగ్గులు వేశారు. ప్రతీ ఇంటి నుంచి కుడుకలు తెచ్చి గ్రామ పటేల్‌కు అందించారు. అలాగే వెదురు బొంగులకు మాతార, మాతరల్‌గా నామకరణం చేసి కుడుకలు, గారెలు, వంకాయలు, ఉల్లిగడ్డలు, చక్కెర బిల్లలు కట్టారు. అనంతరం గ్రామ పొలిమేరకు డోలు, సన్నాయిలతో తరలివెళ్లి కాముడి దహనం చేపట్టారు. పటేళ్ల ప్రత్యేక పూజల అనంతరం.. యువకులు మంటల నుంచి దూకేందుకు పోటీ పడ్డారు. రొట్టెలు, పప్పులు తీసుకువచ్చి కాముడి దహనం వద్ద మళ్లీ పూజలు చేశారు. సహపంక్తి భోజనాల అనంతరం రాత్రంతా అక్కడే బస చేసి ఆడిపాడారు. మంగళవారం గిరిజన గ్రామాల్లో దురాడి పండుగ(హోలీ) సంబురాలు జరుపుకోనున్నారు. – కెరమెరి
సాకడలో కుడకలు స్వీకరిస్తున్న గ్రామ పటేల్
సాకడలో చక్కెర బిల్లలు కడుతూ..
వేడుకల్లో యువకులు..


