రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉపేందర్
ఆసిఫాబాద్‌అర్బన్: తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జిల్లా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ నియమితులయ్యా రు. వరంగల్ జిల్లాలో శనివారం జరిగిన నాలుగో రాష్ట్ర మహాసభల్లో ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎం.నరసింహ తెలి పారు. ఉపేందర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.


