బీమాతో భరోసా | - | Sakshi
Sakshi News home page

బీమాతో భరోసా

Mar 2 2026 7:29 AM | Updated on Mar 2 2026 7:29 AM

బీమాత

బీమాతో భరోసా

స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వ చేయూత ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10లక్షలు చెల్లింపు, రుణమాఫీ

ఆసిఫాబాద్‌అర్బన్‌: కుటుంబానికి వెన్నెముకగా నిలుస్తూ, ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్న స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనందిస్తోంది. వారి జీవితాలకు మరింత ఆర్థిక భద్రతను కల్పిస్తూ, ప్రమాద బీమా పథకాన్ని 2029 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దురదృష్టవశాత్తూ ఎవరైనా సభ్యురాలు ప్రమాదంలో మరణిస్తే బాధిత కుటుంబానికి ఏకంగా రూ.10 లక్షల బీమా పరిహారం అందించడంతో పాటు ఆమె పేరిట ఉన్న రుణాన్ని కూడా పూర్తిగా మాఫీ చేయనుంది. భరోసానిచ్చే ఈ తాజా నిర్ణయంతో మహిళా సంఘాల సభ్యుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మహిళలకు చేయూత...

జిల్లాలో వివిధ సమాఖ్యల్లోని 8,180 సంఘాల్లో 93,796 మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరంతా సీ్త్రనిధి రుణాలతోపాటు బ్యాంకు లింకేజీ రుణాలు పొందుతూ స్వయం ఉపాధి పొందుతున్నారు. గ్రామీణ, పట్టణ, పర్యాటక ప్రాంతాల్లో ఆయా యూనిట్లను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి బీమా పథకాలు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు రుణబీమా పథకాల్లో 101 రిజిస్ట్రేషన్లు పూర్తికాగా, ప్రమాద బీమా కింద 8 రిజిస్ట్రేషన్లు జరిగాయి. లోన్‌ బీమాలో 42 మంది సభ్యులకు రూ.43 లక్షల ఇన్సూరెన్స్‌ సెటిల్మెంట్‌ చేశారు. ప్రమాద బీమాలో ముగ్గురు సభ్యులకు రూ.10 లక్షల చొప్పున రూ.30 లక్షలు చెల్లించారు. మహిళా సంఘాల్లోని సభ్యులు బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవా లని అధికారులు సూచిస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలో స్వయం సహాయక సంఘాల్లో మహిళలు బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. రుణబీమాలో 42 మంది సభ్యులకు రూ.43 లక్షలు చెల్లించాం. అలాగే ప్రమాద బీమాలోనూ ముగ్గురికి రూ.10 లక్షల చొప్పున చెల్లించాం. ఆపదలో బీమా అండగా ఉంటుంది.

– ఆర్‌.శ్రీనివాస్‌, సీ్త్రనిధి ఆర్‌ఎం

అవగాహన కల్పిస్తున్నాం

ప్రభుత్వం మహిళా సంఘాల సభ్యులకు రుణాలు ఇస్తూ ఆర్థిక తోడ్పాటు అందిస్తోంది. రుణం పొందిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే, రూ.10 లక్షల బీమాతో పాటు రుణమాఫీ అవుతుంది. దీనిపై మహిళా సంఘాల సభ్యులకు సెర్ప్‌ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.

– దత్తారావు, డీఆర్‌డీవో

అర్హులు వీరే..

గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో 18– 59 సంవత్సరాల వయస్సు కలిగి, స్వయం సహాయక సంఘంలో స భ్యురాలిగా ఉన్న వారికి బీమా వర్తించనుంది. మహిళా సంఘం సభ్యురాలు స హజ మరణం చెందితే, వారు తీసుకున్న రుణం మాఫీ కానుంది. అదే సీ్త్రనిధి, బ్యాంకు రుణాలు తీసుకున్న మహిళా సంఘం సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణి స్తే, ప్రభుత్వం ద్వారా అందించే రూ.10 లక్షల బీమా సొమ్ము నామినీ ఖాతాలో జమవుతుంది. దీంతో పాటు వారు తీసుకున్న రుణాన్ని సైతం మాఫీ చేస్తారు. 50 శాతానికి మించి అంగవైకల్యం ఏర్పడితే, సదరం ధ్రువపత్రాన్ని పరిశీలించి రూ.5 లక్షలు అందించనున్నారు.

బీమాతో భరోసా1
1/1

బీమాతో భరోసా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement