పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి
కాగజ్‌నగర్‌టౌన్: ప్రశాంత వాతావణంలో పవిత్ర రంజాన్ పండగను జరుపుకోవాలని కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ అన్నారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం చిరువ్యాపారులు, ముస్లిం పెద్దలతో అవగాహన సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మా సాన్ని పురస్కరించుకుని వ్యాపారులు నిర్ణీత సమయం వరకు దుకాణాలను తెరిచి ఉంచాలని సూచించారు. పట్టణంలో అనుమానిత వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. శాంతి భద్రతలకు భంగం కలుగకుండా ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలన్నారు. సమావేశంలో రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సై సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


