ప్రజలు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి

Mar 2 2026 7:29 AM | Updated on Mar 2 2026 7:29 AM

ప్రజలు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి

ప్రజలు ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి

కాగజ్‌నగర్‌టౌన్‌: ప్రజలు ఆధ్యాత్మికను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బా బు అన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణం న్యూకాలనీలోని గాయత్రీ మందిర్‌లో ఆదివారం గాయత్రీ పరివార్‌ ఆధ్వర్యంలో చేపట్టిన 24 కుండీల మహాయజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గాయత్రీ పరివార్‌ గొప్ప ఆధ్మాతిక సమూహంగా ఏర్పడి ప్రజల్లో వైదిక, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ ఈర్ల విశ్వేశ్వర్‌రావు, ఎస్పీఎం జీఎం అనిల్‌కుమార్‌, హనుమంతరావు, రామకృష్ణ, లోకేశ్‌కుమార్‌, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement