‘కాంగ్రెస్‌ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి’ | - | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి’

Mar 1 2026 7:31 AM | Updated on Mar 1 2026 7:31 AM

‘కాంగ్రెస్‌ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి’

‘కాంగ్రెస్‌ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి’

ఆసిఫాబాద్‌అర్బన్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలోనే పేదలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డీసీసీ అధ్యక్షులకు నిర్వహిస్తున్న 15 రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాన్ని శనివారం ఆమె సందర్శించారు. పనుల విధానం, కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, చెల్లింపుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఆదాయం సమకూరుస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వం పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయతిస్తోందని, నిధుల కోత, పనిదినాల తగ్గింపు జీవనోపాధిపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement