రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో | - | Sakshi
Sakshi News home page

రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో

Mar 1 2026 7:31 AM | Updated on Mar 1 2026 7:31 AM

రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో

రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో

ఆసిఫాబాద్‌అర్బన్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కుమ్మెరలో చిన్నారి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని రజక సంఘం ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌక్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎ మ్మార్పీఎస్‌, కేవీపీఎస్‌, డీవైఎఫ్‌ఐ, ఇతర ప్ర జా సంఘాల నాయకులు మద్దతు పలికారు. వారు మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేసే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కడతల మల్లయ్య, వేములవాడ గణపతి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్‌నార్‌ రమేశ్‌, నాయకులు కేశవ్‌రావు, దుర్గం దినకర్‌, గొడిసెల కార్తీక్‌, జయరాజ్‌, మారుతి పటేల్‌, రాజేందర్‌, సాయి, రాజేశ్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement