హెల్త్‌ మిషన్‌ @100 రోజులు | - | Sakshi
Sakshi News home page

హెల్త్‌ మిషన్‌ @100 రోజులు

Mar 1 2026 7:31 AM | Updated on Mar 1 2026 7:31 AM

హెల్త్‌ మిషన్‌ @100 రోజులు

హెల్త్‌ మిషన్‌ @100 రోజులు

● స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు వైద్యపరీక్షలు ● రేపటి నుంచి ప్రారంభానికి కసరత్తు

డీఎంహెచ్‌వో సీతారాం

ఆసిఫాబాద్‌: మహిళల ఆరోగ్యంపై తెలంగాణ ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర ఆరోగ్య వ్యస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా వైద్యారో గ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్‌ మిషన్‌ –100 పేరుతో వంద రోజుల ప్రత్యేక వైద్యశిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో వైద్యసేవలు అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయంతో స్థానికులకు మేలు చేకూరనుంది. ముఖ్యంగా మహిళలకు లబ్ధి జరగనుంది. మార్చి 2 నుంచి జూన్‌ 9 వరకు కొనసాగుతుంది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, బలహీన వర్గాల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ఈ కార్యక్రమం రూపొందించారు. ఇందులో స్వయం సహాయక సంఘాల సభ్యులకు 30 రకాల ఉచిత ఆరోగ్య పరీక్షలు చేపట్టి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్స్‌ రూపొందించనున్నారు. జిల్లాలో 9,796 సంఘాల్లో 1,02,352 మంది మహిళా సభ్యులు ఉన్నారు. బీపీ, షుగర్‌, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌తో తదితర రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు.

నాలుగు దశల్లో సేవలు

జిల్లాలో మొదటి దశ మార్చి 2 నుంచి 31 వరకు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నా రు. గర్భిణులు, బాలురు, వృద్ధులు, రక్తహీనత పరీ క్షలు, ఇమ్యునైజేషన్‌, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ చేపట్టనున్నారు. క్యాన్సర్‌ రిజిస్ట్రీ ఏర్పాటు చేసి, ఆరోగ్య మహిళా కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. పీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. రెండోదశలో భాగంగా ఏప్రిల్‌ 1 నుంచి 15 వరకు అసంక్రమణ వ్యాధులపై దృష్టి సారిస్తారు. ఇక మూడో దశలో ఏప్రిల్‌ 16 నుంచి మే 15 వరకు అంటువ్యాధుల నియంత్రణ, టీబీ డ్రైవ్‌, జైళ్లలో హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఎండదెబ్బ నుంచి రక్షణ పొందేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక హీట్‌ స్ట్రోక్‌ మేనేజ్‌మెంట్‌ గదులు సిద్ధం చేయనున్నారు. మే 16 నుంచి జూన్‌ 9 వరకు నాలుగో దశ కార్యక్రమాలు నిర్వహిస్తారు. పట్టణ, గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బలపరచి, నిపుణులు సేవలందించడం, వైద్య శిబిరాలు నిర్వహించాలి.

కార్యక్రమాల నిర్వహణ ఇలా..

మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్య డ్రైవ్‌ నిర్వహిస్తారు. మా ర్చి 16న జాతీయ టీకా దినోత్సవాన్ని పురస్కరించుకుని టీకా కార్యక్రమం నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ వైద్యులకు అవార్డులు ప్రదానం చేస్తారు. జూన్‌ 7న ప్రపంచ ఆహార భద్రతా దినో త్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలు చేపడతారు.

నాలుగు దశల్లో కార్యక్రమాలు

ఆసిఫాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే హెల్త్‌ మిషన్‌– 100 కార్యక్రమాలు జిల్లాలో నాలుగు దశల్లో నిర్వహిస్తామని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సీతారాం తెలిపారు. జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో శనివారం వైద్యాధికారులు, హెచ్‌ఎస్‌, హెచ్‌ఈఎస్‌లు, పీహెచ్‌ఎన్‌ఎస్‌లు, సీహెచ్‌వోలు, రాష్ట్ర బాల స్వస్థ కార్యక్రమం వైద్యాధికారుల కు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఎన్‌సీడీ ప్రో గ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ ఉప్పరి వెంకటేశ్‌ సిబ్బందికి అవగాహన కల్పించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, రా ష్ట్ర ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చే యడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement