ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసు ఎత్తివేయాలి
రెబ్బెన: క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఇన్‌చార్జిగా బీఆర్‌ఎస్ పార్టీ తరఫున వెళ్లిన ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. గోలేటి టౌన్‌షిప్‌లోని టీబీ జీకేఎస్ యూనియన్ కార్యాలయంలో శనివా రం మాట్లాడారు. క్యాతన్‌పల్లిలో బీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యత ఉన్నా కాంగ్రెస్ పార్టీ, మంత్రి వివేక్ అధికార బలంతో చైర్మన్ ఎన్నికను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షతో చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసులు పెట్టడం సరికాదన్నారు. పోలీసులు ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నా యకులపై కేసులు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధారావత్ మంగీలాల్, సెంట్రల్ కమిటీ నాయకులు సత్యనారాయణ, ఫిట్ కార్యదర్శి మెరుగు రమేశ్, ఆఫీస్ ఇన్‌చార్జి మహేందర్, నా యకులు వీరస్వామి, సీహెచ్‌పీ అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.


