నేడే ఆఖరు | - | Sakshi
Sakshi News home page

నేడే ఆఖరు

Feb 28 2026 7:30 AM | Updated on Feb 28 2026 7:30 AM

నేడే ఆఖరు

నేడే ఆఖరు

● జిల్లాలో పూర్తికాని ఫార్మర్‌ రిజిసీ్ట్ర ● ఇప్పటివరకు 56 శాతం రైతుల వివరాలు నమోదు

కాగజ్‌నగర్‌టౌన్‌: రైతులకు గుర్తింపు సంఖ్య(ఫార్మర్‌ ఐడీ) అందించేందుకు ప్రభుత్వం ఫార్మర్‌ రిజిస్ట్రీ ప్రక్రియను గతేడాది ప్రారంభించింది. శనివారంతో గడువు ముగుస్తుండగా జిల్లాలో ఇప్పటివరకు 56 శాతం మాత్రమే ప్రక్రియ పూర్తయింది. వ్వయసాయాధికారులు, ఏఈవోలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి, రైతు వేదికల్లో వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులు ముందుకు రాకపోవడంతో ఏఈవోలు క్షేత్రస్థాయికి గ్రామాల్లో తిరుగుతూ వివరాలు యాప్‌లో నమోదు చేస్తున్నారు. గడువు నేటితో ముగుస్తుండడంతో వ్యవసాయాధికారులు ఆయా రైతువేదికల్లో క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

70,678 మంది వివరాలు నమోదు

జిల్లాలోని పదిహేను మండలాల్లో లక్ష 36 వేల మంది రైతులు ఉండగా శుక్రవారం 5.30 గంట ల వరకు 70,678 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మరో 56,096 మంది వివరాలు నమో దు చేసుకోవాల్సి ఉంది. జిల్లాలో 59 శాతం మాత్రమే పూర్తయ్యింది. అత్యధికంగా కౌటాలలో 78 శాతం, అతి తక్కువగా లింగాపూర్‌లో 40 శాతం ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యిందని అధికారులు వెల్లడించారు.

ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు

రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకు 11 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిస్తున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ పథకాలు పొందే వీలుంటుంది. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకు మాత్రమే పీఎం కిసాన్‌, ఎరువులు, సబ్సిడీలు, పంటల బీమా, వ్యవసాయ రు ణాలు, పంటల కొనుగోలు సమయంలో మద్ద తు ధర వంటి ప్రయోజనాలు పొందే ఆస్కారం ఉంటుందని వ్యవసాయాధికారులు స్పష్టం చే స్తున్నారు. అలాగే పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయించవచ్చు. తక్కువ వడ్డీకి రుణాలను పొందవచ్చు. క్రాప్‌ ఇన్సూరెన్స్‌ చేసుకునే వీలుంటుంది. రైతుల భూమి రికార్డులు డిజిటల్‌ రూపంలో ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement