మూడేళ్లుగా వేలం బంద్‌ | - | Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా వేలం బంద్‌

Feb 27 2026 4:19 AM | Updated on Feb 27 2026 4:19 AM

మూడేళ్లుగా వేలం బంద్‌

మూడేళ్లుగా వేలం బంద్‌

ఏటా వేసవికి ముందు ఈ పండ్ల తోటలకు వేలం నిర్వహించేవారు. కానీ మూడేళ్లుగా వేలం నిర్వహించకపోవడం, ఆలనాపాలన కొరవడడంతో తోట కాస్త అడవిని తలపిస్తోంది. ఉద్యానవనం నిర్వహణ దయనీయంగా మారింది. లోపలికి వెళ్లే రహదారిపై పిచ్చిమొక్కలు పెరిగి చెత్తాచెదారంతో నిండిపోయింది. మూడేళ్లుగా పండ్లు చోరుల పాలవుతున్నాయి. టన్నుల కొద్దీ మామిడి, సపోట పండ్లు ఐటీడీఏకు చెందిన ఓ అధికారి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పేరుతో ప్రత్యేక వాహనాల్లో తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఐటీడీఏ ఉన్నతాఽధికారులు విచారణ చేపడితే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా ఐటీడీఏ పరిధిలోని ఉద్యానవన కేంద్రాల కోసం కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ కేవలం ఉట్నూర్‌కే పరిమితమవడం జిల్లాలోని ఇతర కేంద్రాల్లోని నర్సరీలకు ఇబ్బందిగా మారింది. ఆసిఫాబాద్‌ నర్సరీలో విద్యుత్‌ సమస్య ఉంది. విద్యుత్‌ సరఫరా రాగానే, త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు హెచ్‌ఈవో జయరాజ్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement