‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీ క్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. పరీక్షల నిర్వహణపై జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, ఫ్యాన్లు, ఫర్చీచర్, విద్యుత్ తదితర వసతులు కల్పించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలు సజావుగా జరిగే చూడాలన్నారు. సమావేశంలో పరీ క్షల నిర్వహణ అధికారి సచ్చినంద చారి, ఎంఈవో సుభాష్, హెచ్‌ఎం సత్యనారాయణ, ఎస్‌వో లతీఫ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


