సెకండియర్ పరీక్షలు షురూ
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలోని 19 కేంద్రాల్లో గురువారం ఇంటర్మీడియెట్ రెండో సంవత్స రం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షకు 4,439 మంది విద్యార్థులకు 4,345 మంది విద్యార్థులు హాజరుకాగా 94 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 3,776 మందికి 3,698 మంది హాజరు కాగా 78 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 663 మంది విద్యార్థుల కు 647 మంది హాజరుకాగా, 16 మంది గైర్హాజరయ్యారని డీఐఈవో రాందాస్ వెల్లడించా రు. బెజ్జూర్ ప్రభుత్వ కళాశాలను ఆయన తని ఖీ చేశారు. ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించాలని సూచించారు.


