పాలనలో ముద్ర.. విద్యాశాఖపై పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

పాలనలో ముద్ర.. విద్యాశాఖపై పర్యవేక్షణ

Feb 27 2026 4:19 AM | Updated on Feb 27 2026 4:19 AM

పాలనల

పాలనలో ముద్ర.. విద్యాశాఖపై పర్యవేక్షణ

● అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి బదిలీ ● వికారాబాద్‌ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ

ఆసిఫాబాద్‌అర్బన్‌/ఆసిఫాబాద్‌రూరల్‌: పాలనలో తనదైన ముద్రవేసి, విద్యాశాఖపై పర్యవేక్షణను పెంచిన అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) దీపక్‌ తివారి బదిలీ అయ్యారు. పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన దీపక్‌ తివారిని వికారాబాద్‌ కలెక్టర్‌గా నియమించారు. ఆయన స్థానంలో ప్రస్తుతం ఎవరినీ నియమించలేదు. జిల్లాలో రెండు సంవత్సరాల పాటు అదనపు కలెక్టర్‌గా ఆయన పనిచేశారు. అలాగే విద్యాశాఖ ఇన్‌చార్జి జిల్లా అధికారిగా నూ అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉట్నూర్‌ ఐటీడీఏ పీవోగా పనిచేస్తూ ప్రస్తుతం లీవ్‌లో ఉన్న ఆయ న సతీమణి ఖుష్బూ గుప్తాను సైతం మహబూ బ్‌నగర్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది.

ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా బదిలీ

కై లాస్‌నగర్‌: ఉట్నూర్‌ ఐటీడీఏ ప్రాజె క్ట్‌ అధికారి ఖుష్బూ గుప్తా బదిలీ అ య్యారు. ప్రస్తుతం ప్రసూతి సెలవులో ఉన్న ఆమెను మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆమె తొలుత ఆదిలాబాద్‌ స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు. 2024 ఫిబ్రవరిలో ఉట్నూర్‌ ఐటీడీఏ పీవోగా బదిలీ అ యిన ఆమె అదే ఏడాది నవంబర్‌ 4 నుంచి ప్రసూతి సెలవుపై వెళ్లారు. ఈ ఏడాది మే 3వరకు ఆమెకు ప్రభుత్వం సెలవు మంజూరు చేసినా తా జాగా జిల్లా నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో పీవోగా కొత్త అధికారులెవరిని ఇంకా నియమించలేదు. ప్రస్తుతం ఉట్నూర్‌ సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ ఇన్‌చార్జి పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇన్‌చార్జి డీఈవోగా ఏడు నెలలు

విద్యారంగంలో వెనుకబడి ఉన్న జిల్లాలో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి 2025 ఆగస్టు 5న ఇన్‌చార్జి డీఈవోగా బాధ్యతలు చేపట్టా రు. గాడితప్పిన విద్యాశాఖపై ఆయన పర్యవేక్షణ పెంచారు. నిత్యం పాఠశాలలను తని ఖీ చేస్తూ ఉపాధ్యాయ, విద్యార్థుల హాజరు పెంచేందుకు కృషి చేశారు. ఐఏఎస్‌ స్థాయి అధికారి విద్యాశాఖ అధికారిగా ఉండటంతో ఎంఈవోలు, ఉపాధ్యాయుల్లో బాధ్యత పెరి గింది. పాఠశాలల తనిఖీ సమయంలో స్వ యంగా పాఠాలు బోధిస్తూ, విద్యార్థులతో పుస్తకాలు చదివిస్తూ విద్యా సామర్థ్యాలు పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో వసతుల కల్పన పనులు పూర్తి చేయించడంతోపాటు మానిటరింగ్‌ వ్యవస్థను పటిష్టంగా అమలుపర్చారు. పదో తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల సమయంలో ఉదయం, సాయంత్రం సింగరేణి ఆధ్వర్యంలో స్నాక్స్‌ అందించేందుకు కృషి చేశారు.

పాలనలో ముద్ర.. విద్యాశాఖపై పర్యవేక్షణ1
1/1

పాలనలో ముద్ర.. విద్యాశాఖపై పర్యవేక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement